Saturday, September 19, 2026 11:17 PM
Saturday, September 19, 2026 11:17 PM

కేసీఆర్ యుద్ధం షురూ.. క్యాడర్ లో కొత్త జోష్..!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాల దిశగా అడుగులు పడుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత, మాజీ సిఎం కేసీఆర్ మళ్ళీ జనంలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 20వ తేదీన జగిత్యాల వేదికగా జరగనున్న భారీ బహిరంగ సభతో కేసీఆర్ ప్రతిపక్ష నేతగా.. రాష్ట్ర ప్రభుత్వంపై యుద్దాన్ని షురు చేసే ఛాన్స్ కనపడుతోంది. ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్న నేపధ్యంలో.. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

Also Read : హైడ్రా కమిషనర్ పగ తీర్చుకుంటున్నారా..?

ఇక ఈ సభతోనే.. అధికార పార్టీకి గట్టి హెచ్చరికలు పంపేలా ప్లాన్ చేస్తున్నారు. సీనియర్ నేత జీవన్ రెడ్డి వేలాది మంది అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. కేసీఆర్ స్వయంగా ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారి తీసే అవకాశం కనపడుతోంది. కేసీఆర్ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

Also Read : ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!

కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ వసంత తదితరులు సభా స్థలాన్ని పరిశీలించారు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్.. దూకుడుగా రాజకీయం చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. జగిత్యాల సభ ద్వారా కేసీఆర్ మళ్ళీ తన మార్కు విమర్శలతో ప్రభుత్వంపై విరుచుకుపడతారని కార్యకర్తలు భావిస్తున్నారు. కేసీఆర్ రాకతో కేడర్‌ లో కొత్త ఉత్సాహం నెలకొంది. జగిత్యాల వేదికగా కేసీఆర్ ఏయే అంశాలను ప్రస్తావిస్తారు..? జీవన్ రెడ్డి రాకతో సమీకరణాలు ఎలా మారుతాయి..? అనేది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్