Wednesday, May 6, 2026 09:20 PM
Wednesday, May 6, 2026 09:20 PM

భారత్ పై భారీ సుంకాలు.. అమెరికన్ మీడియా సంచలనం..!

భారత్ విషయంలో కక్ష సాధింపుగా వ్యవహరిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు భారత్ కు మరో భారీ షాక్ ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. హెచ్ 1 బీ వీసాల విషయంలో భారత్ ను టార్గెట్ చేసిన అంకుల్ శ్యాం.. ఇప్పుడు రష్యాపై ఉన్న కోపాన్ని భారత్ పై మరింతగా చూపేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా 50 శాతం సుంకాలు విధించిన ట్రంప్.. ఇప్పుడు భారీగా సుంకాలు పెంచేందుకు రెడీ అయ్యారు. దీనిపై అమెరికన్ మీడియా సంచలన కథనం ప్రచురించింది.

Also Read : రప్ప రప్ప ఆపొద్దు.. కార్యకర్తలకు జగన్ సిగ్నల్..!

డొనాల్డ్ ట్రంప్.. ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఈ బిల్ ద్వారా.. భారత్, చైనా, బ్రెజిల్‌ తో సహా రష్యాతో వ్యాపారం చేస్తోన్న దేశాలపై చమురు కొనుగోలు చేసేందుకు భారీ జరిమానా విధించే అవకాశం ఉండవచ్చని ప్రముఖ సెక్యూరిటీ హాక్ రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం పేర్కొన్నారు. బ్లూమెంటల్ ఆంక్షల బిల్లు ఆమోదం పొందితే, రష్యా చమురు లేదా యురేనియంను కొనుగోలు చేస్తే.. ఆయా దేశాలపై 500 శాతం వరకు సుంకాలు విధించడానికి అమెరికా అధ్యక్షుడికి అధికారం లభిస్తుంది.

Also Read : మోదీ గురించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు..!

ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ప్రారంభమైన యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ సర్కార్ చర్చలు కొనసాగిస్తోంది. ఇప్పుడు రష్యాను అంతర్జాతీయంగా ఇబ్బంది పెట్టి, ఒంటరి చేసేందుకు రెడీ అవుతోంది. బుధవారం వైట్ హౌస్ లో ట్రంప్ తో సమావేశమయ్యానని, నెలల తరబడి చర్చల్లో ఉన్న ఈ బిల్లుకు అధ్యక్షుడు తన మద్దతును తెలిపారని గ్రాహం తెలిపారు. అసోసియేటెడ్ ప్రెస్ తో మాట్లాడుతూ వైట్ హౌస్ అధికారి ఒకరు దీనిని ధృవీకరించారు. వచ్చే వారం ప్రారంభంలోనే ఓటింగ్ జరగవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. అమెరికన్ కాంగ్రెస్ దీనిని ఆమోదిస్తే మాత్రం పరిణామాలు మరింత తీవ్రంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్