Saturday, July 11, 2026 05:51 PM
Saturday, July 11, 2026 05:51 PM

అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ

వైసీపీ అధికారంలో ఉన్నప్పటి కంటే కోల్పోయిన తర్వాత ఎక్కువగా ఫేమస్ అయ్యారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్. వ్యక్తిగత విమర్శలు, అసభ్యకరమైన వ్యాఖ్యలతో నిత్యం మీడియాలో కనపడే వల్లభనేని వంశీ.. 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టు అయ్యారు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది సాధ్యం కాలేదు. ఇక ఆయన అరెస్టు అయిన తర్వాత నుంచి ఆయన మీడియాలో కనపడిన ప్రతిసారి.. టిడిపి కార్యకర్తలు ఒక రకంగా పండగ చేసుకున్నారనే చెప్పాలి. ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్న వంశీ.. మళ్లీ నియోజకవర్గంలో దూకుడు పెంచారు అనే కామెంట్స్ వినిపించాయి.

Also Read :బెజవాడ పోలీసుల సంచలన నిర్ణయం..!

తనతో గతంలో సన్నిహితంగా ఉన్న వాళ్ళతో ఆయన ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయ్యాయి. నియోజకవర్గపై పూర్తిస్థాయిలో పట్టున్న వంశీ.. అటు తన అనుచరులను కూడా యాక్టివ్ చేస్తున్నారు అనే ప్రచారం జరిగింది. అయితే వరుస కేసుల్లో వారు అరెస్టు కావడం, లొంగిపోవడం వంటివి జరిగాయి. అయినా సరే వంశీలో మాత్రం దూకుడు తగ్గలేదు. సోషల్ మీడియాలో కొంత దూకుడుగా కామెంట్స్ చేశారు. ఇలాంటి టైంలో మరో కేసు నమోదు అయింది.

Also Read : రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్సీ.. మరీ ఇంత బరితెగింపా..!

2024 జూన్ 7న సునీల్ అనే వ్యక్తిపై జరిగిన దాడి కేసులో వంశీ ప్రధాన నిందితుడుగా ఉన్నారు. ఈనెల 17న వంశీ పై హత్యాయత్నం కేసు మాచవరం పోలీసులు నమోదు చేశారు. ఆ తర్వాత కూడా బయట కనపడిన వంశీ.. ధైర్యంగానే మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు వంశీ. దీనితో వంశీ కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. రెండు బృందాలుగా విడిపోయి వంశీ కోసం గాలిస్తున్నట్టు సమాచారం. తప్పుడు కేసులకు భయపడనని చెప్పిన వంశీ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో నియోజకవర్గంలో మళ్లీ కలకలం రేగింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం వంశీ ప్రొఫైల్ నుంచి పలు పోస్టులు కూడా దర్శనమిచ్చాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆ ముగ్గురి చుట్టూ...

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్...

కఫ్ సిరప్‌లపై కేంద్రం...

భారత్ లో ఆల్కహాల్ కలిగిన సిరప్‌లు,...

కొరియా స్టాక్ మార్కెట్‌ను...

ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి...

అంతా ఓపెన్.. రావణ్‌కు...

వైసీపీ ముసుగు తొలిగిపోయింది. యూట్యూబర్ ప్రశ్న...

దూకుడు పెంచిన కవితక్క.....

తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి....

మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.....

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా...

పోల్స్