Saturday, September 19, 2026 06:10 PM
Saturday, September 19, 2026 06:10 PM

హైదరాబాద్ లో బెజవాడ మైనర్లు సంచలనం..!

ఈరోజుల్లో ఖర్చుల దెబ్బకు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడిపోతున్నారు యువత. వేరు కాపురం పెట్టాలంటే.. వేలకు వేలు ఖర్చు కావడంతో చాలామంది పెళ్లి చేసుకోకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రోజురోజుకి ఖర్చులు పెరిగిపోవడం, పిల్లల పెంపకం కష్టంగా మారడంతో చాలామంది పిల్లలు కూడా వద్దనుకునే పరిస్థితి ఈ రోజుల్లో నెలకొంది. వివాహాలు చేసుకున్న తర్వాత చాలామంది ఖర్చులు భరించలేక విడాకులు ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రతి ఒక్కటి ఖరీదైన అంశం కావడంతో.. ఆదాయం పెంచుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు.

Also Read : మహిళల చేత మారణహోమం.. ఎర్రకోట బ్లాస్ట్ లో సంచలన విషయాలు

ఈరోజుల్లో రెండు లక్షల సంపాదిస్తున్న వారికి కూడా కుటుంబం గడపటం కష్టంగా మారింది. అలాంటిది మైనర్లు పెళ్లిళ్లు చేసుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా ఆశ్చర్యం కలిగించే అంశం. తాజాగా హైదరాబాదులో పోలీసులు వద్దకు చేరిన పంచాయతీ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. విజయవాడకు చెందిన ఇద్దరు మైనర్లు గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఎలాగైనా సరే కలిసి ఉండాలని, పెళ్లి చేసుకోవాలని పట్టుదలగా అడుగులు వేశారు. కుటుంబ సభ్యులకు చెప్పకుండా.. విజయవాడ బస్టాండ్ లో హైదరాబాద్ బస్సు ఎక్కారు. నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు.

Also Read : తీరం దాటిన కర్ణాటక రాజకీయ తుఫాన్

అక్కడికి వెళ్లి, వనస్థలిపురంలో ఆటో ఎక్కి తుక్కుగూడ వెళ్ళి అక్కడ ఇల్లు అద్దెకి తీసుకునేందుకు ప్రయత్నం చేశారు. ఆటో డ్రైవర్ కు డబ్బులు ఇచ్చి ఇంటి అద్దె కోసం తిరిగారు. ఆటో డ్రైవర్ కు డౌట్ రావడంతో ఇద్దరినీ నేరుగా పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లాడు. దీంతో పోలీసులు కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే విజయవాడలో ఉన్న కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి జరుగుతున్న విషయం వివరించారు. విజయవాడ నుంచి కుటుంబ సభ్యుల హైదరాబాద్ చేరుకుని వారిద్దరినీ విజయవాడ తీసుకువెళ్లారు. తండ్రి జేబులో పదివేల రూపాయలు డబ్బులు, ఫోన్ తీసుకుని బాలుడు హైదరాబాద్.. బాలికతో కలిసి వెళ్లినట్లు గుర్తించారు. ఇప్పుడు ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

పోల్స్