Saturday, September 19, 2026 08:15 PM
Saturday, September 19, 2026 08:15 PM

గ్రీన్ కార్డ్ పై గురిపెట్టిన ట్రంప్.. కష్టమే..!

ఇమ్మిగ్రేషన్ చట్టాల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తోన్న అమెరికాలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడి పౌరులను పెళ్లి చేసుకుంటే.. గ్రీన్ కార్డ్ లేదా పౌరసత్వం వస్తుందనే భావనలో ఉన్న వారికి షాక్ తగులుతోంది. గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూల సమయంలో అనేక మంది అమెరికన్ పౌరుల విదేశీయుల జీవిత భాగస్వాములను అదుపులోకి తీసుకున్నట్లు అమెరికన్ మీడియా ఓ సంచలన కథనం ప్రచురించింది. నవంబర్ 12 నుండి శాన్ డియాగోలోని ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో డజన్ల కొద్దీ ఇటువంటి నిర్బంధాలు జరిగాయని అక్కడి మీడియా తెలిపింది.

Also Read : రాజకీయం మొదలెట్టిన రేవంత్..? బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి..!

వీసా నిబంధనలను ఉల్లంఘించినందుకు కూడా వీరిపై అభియోగాలు మోపినట్లు సమాచారం. గ్రీన్ కార్డ్ ఉంటే వలసదారుడు అమెరికాలో శాశ్వతంగా నివసించడానికి, పని చేయడానికి అనుమతి ఉంటుంది. కొత్తగా పెళ్లైన చాలా మంది జంటలకు, గ్రీన్ కార్డ్ పొందడం అనేది ఓ కల. కానీ పరిస్థితి మాత్రం ఊహించని విధంగా దెబ్బ కొట్టింది. అదుపులోకి తీసుకున్న వారిలో బ్రిటిష్, జర్మన్ జాతీయులు ఎక్కువగా ఉన్నారు. బాలింతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

Also Read : మావోయిస్టు పోరాటం ఆరోజుతో ముగింపు..!

ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత, ఫెడరల్ ఏజెంట్లు ఆకస్మికంగా వచ్చి విదేశీ జీవిత భాగస్వామిని చేతికి సంకెళ్లు వేసి తీసుకెళ్లారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఏడుస్తున్న నా భార్య చేతుల నుండి నేను మా బిడ్డను తీసుకోవలసి వచ్చింది అని గ్రీన్ కార్డు కోసం వెళ్ళిన స్టీఫెన్ పాల్ చెప్పినట్లు సమాచారం. అతని బ్రిటిష్ భార్య కేటీని పోలీసులు అదుపులోకి థేసుకున్నారూ. గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూల సమయంలో అదుపులోకి తీసుకున్న వారిలో కొంతమంది సైనిక అధికారుల జీవిత భాగస్వాములు కూడా ఉండటం గమనార్హం. యుఎస్ మెరైన్స్‌తో 20 సంవత్సరాలు గడిపిన సామ్యూల్ షాస్టీన్ కూడా ఈ పరిస్థితి ఎదుర్కొన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్