Monday, March 23, 2026 05:41 AM
Monday, March 23, 2026 05:41 AM

కర్మ హిట్స్ బ్యాక్.. కవిత సంచలన కామెంట్స్

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అందరూ ఊహించినట్లుగానే కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. పాతికవేల పైచిలుకు ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. ఎన్నికలపై ముందు నుంచి ఫోకస్ పెట్టిన ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి.. ఓటమితో ఒక రకంగా షాక్ లో ఉందనే చెప్పాలి. గెలుపోటముల సంగతి పక్కన పెడితే.. కాంగ్రెస్ విజయం విషయంలో కొందరు భారత రాష్ట్ర సమితి వ్యతిరేకులు చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో సీఎం గా కేసీఆర్ ఉన్న సమయంలో అనుసరించిన వైఖరిపై ఇప్పుడు విమర్శలు వ్యక్తం కావడమే కాకుండా.. సరైన గుణపాఠం లభించింది అనే కామెంట్స్ వినపడుతున్నాయి.

Also Read : రేవంత్ ను తక్కువ అంచనా వేశారా..?

పాలేరు ఉపఎన్నికతో పాటుగా పలు సందర్భాల్లో అప్పట్లో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి.. నియంతృత్వ పోకడలతో ముందుకు వెళ్లిందని విమర్శలు వచ్చాయి. పాలేరు ఉప ఎన్నికల విషయంలో.. అప్పట్లో కెసిఆర్ వైఖరి పై తీవ్ర విమర్శలు వచ్చాయి. రామిరెడ్డి వెంకటరెడ్డి మరణించిన తర్వాత.. ఆయన సతీమణి పోటీ చేయగా.. ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి నుంచి తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి.. విజయం సాధించిన తర్వాత ఆయనకు మంత్రి పదవి అప్పగించారు. దీనిపై రాజకీయంగా విమర్శలు వచ్చాయి.

Also Read : మాగంటి కోట కూలింది.. జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ భారీ ఆధిక్యం..!

తాజాగా జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థిని నిలబెట్టడానికి ప్రధాన కారణం ఇదే అనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. తాజాగా ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీనిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ట్వీట్ చేశారు. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఆమె పోస్ట్ చేశారు. దీనిని విశ్లేషిస్తున్న రాజకీయ పరిశీలకులు.. కవితకు భారత రాష్ట్ర సమితి అన్యాయం చేసిందని.. దాని ప్రభావమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోయిందని కామెంట్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కవిత భారత రాష్ట్ర సమితికి పరోక్షంగా వ్యతిరేకంగా పనిచేశారని కామెంట్స్ అయితే వినిపించాయి. పలు సందర్భాల్లో ఆమె పరోక్షంగా బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచినా పెద్దగా ఉపయోగం లేదనే అంశాన్ని, అలాగే భారత రాష్ట్ర సమితి నాయకుల చేసిన అవినీతి వ్యవహారాలను ప్రజల్లో విమర్శించే విషయంలో కూడా కవిత కొంత సక్సెస్ అయ్యారు. ఇక బీఆర్ఎస్ నేతలపై తనకున్న కోపాన్ని కవిత కొన్ని సందర్భాల్లో ప్రదర్శించారనే కామెంట్స్ అయితే వినిపించాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్