Saturday, September 19, 2026 03:29 PM
Saturday, September 19, 2026 03:29 PM

బీహార్ లో ఆర్జెడి చివరికోట కూలిందా..? బీహార్ లో ఎన్డియే డామినేషన్..!

అందరూ ఊహించినట్లు గానే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డియే విజయం దిశగా దూసుకుపోతోంది. రెండు దశల్లో జరిగిన బీహార్ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంట నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎన్డియే ఓడిపోతే.. కేంద్రంలో కూడా పరిస్థితి మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు బలంగా వినిపించాయి. దీనితో ప్రధాని మోడీ నుంచి కింది స్థాయి బిజెపి కార్యకర్త వరకు ఈ ఎన్నికలను అత్యంత సీరియస్ గా తీసుకుని పని చేయడంతో ఎన్నికలు మరింత ఆసక్తిగా మారాయనే చెప్పాలి.

Also Read : కొండా – అక్కినేని మధ్య రాజీ చేసింది ఎవరు..?

ఇక నేడు వెలువడుతున్న ఫలితాల్లో ఎన్డియే ఆది నుంచి దూకుడు ప్రదర్శిస్తోంది. ఎన్డియే 162 సీట్ల ఆధిక్యంలో ఉండగా.. మహాఘట్‌ బంధన్ 77 సీట్లతో ఆధిక్యంలో ఉంది. ఆర్జెడికి పట్టు ఉన్న ప్రాంతాల్లో కూడా ఎన్డియే ఆధిక్యం ప్రదర్శించడం గమనార్హం. పాటలీపుత్ర బెల్ట్‌ లో ఎన్డియే ఆధిక్యం సాధిస్తోంది. వాస్తవానికి ఈ బెల్ట్ లో రాష్ట్రీయ జనతాదళ్ ఆధిక్యం ప్రదర్శిస్తూ ఉంటుంది. పాటలీపుత్ర జోన్‌ లోని 60 అసెంబ్లీ సీట్లలో, ఎన్డియే.. 42 సీట్లలో ఆధిక్యంలో ఉండగా.. మహాఘటబంధన్ 18 సీట్లలో ఆధిక్యంలో ఉంది.

Also Read : బ్రేకింగ్: పరకామణి కేసులో కీలక నిందితుడు అనుమానాస్పద మృతి

దీనితో లాలూ ప్రసాద్ యాదవ్ కోట కూలింది అనే చెప్పాలి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత గంటలోపే ఎన్డియే స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. ముందు నుంచి ఎగ్జిట్ పోల్స్ ఎన్డియే విజయం సాధిస్తోందని అంచనా వేస్తూ వచ్చాయి. అయితే ఇండియా కూటమి మాత్రం తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ పోటీ చేసిన 61 సీట్లలో 15 చోట్ల ఆధిక్యంతో స్వల్పంగా పుంజుకుంది. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జనసురాజ్ పార్టీ 3 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్