మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా పెద్ది. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో వస్తున్న ఈ పెద్ది ఫస్ట్ సింగిల్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మార్చేశారు. క్రికెట్ బ్యాట్‌తో రామ్‌చరణ్ కొట్టిన షాట్.. చివరికి ఐపీఎల్ జట్లు కూడా అనుకరించే స్థాయికి చేరుకున్నాయి. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ఇప్పటి వరకు రాలేదు. దీంతో పెద్ది ఎలా ఉన్నాడు.. ఎప్పుడు వస్తాడు.. ఎలా వస్తాడు.. అనే మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read : క్యాబినెట్ నుంచి ఆ ముగ్గురు అవుట్..!
పెద్ది సినిమకు సంబంధించిన బిగ్ అప్ డేట్ ఇచ్చారు దర్శకులు బుచ్చిబాబు సనా. పెద్ది సినిమా వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో సినిమాకు సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్ కూడా మరో రెండు రోజుల్లో వస్తున్నట్లు బుచ్చిబాబు ప్రకటించారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. పెద్ది సినిమాకు సంబంధించిన రెండు రోజుల నుంచి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Also Read : కొలికపూడి కథ కంచికి చేరినట్లేనా..?
రహమాన్, బుచ్చిబాబు కలిసున్న ఫోటో పోస్ట్ చేసిన రామ్ చరణ్.. ఏం వండుతున్నారు సార్.. అని కామెంట్ చేశారు. దీనికి బుచ్చిబాబు చికిరి సార్.. అని జవాబిచ్చారు. దీంతో చికిరి అంటే ఏమిటంటూ చెర్రి ఫ్యాన్స్ ఆసక్తి చూపించారు. చెప్పినట్లుగానే చికిరి అంటే ఏమిటనే విషయాన్ని బుచ్చిబాబు రివిల్ చేశారు. కొండల్లో ఉంటున్న హీరో పెద్ది.. ఫస్ట్ టైమ్ హీరోయిన్‌ను చూసిన తర్వాత తన ఫ్రెండ్‌తో చెప్పిన మాటలంటూ రహమాన్‌తో బుచ్చిబాబు చెబుతూ.. అరుదైన చికిరి.. అన్నారు. చికిరి అంటే ఆడపిల్లల్ని ముద్దుగా, అందంగా, ప్రేమగా పిలుస్తారనటంతో.. చికిరి అనే మాట బాగుంది కదా.. అదే పెడదామంటూ రహమాన్ అనటం.. ఈ కాన్వర్జేషన్‌తోనే పెద్ది ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు బుచ్చిబాబు. చికిరి పూర్తి సాంగ్ ఈ నెల 7వ తేదీ రిలీజ్ అవుతుంది. ఈ సాంగ్‌లో చెర్రి స్టెప్ట్ సూపర్ గా ఉందంటున్నారు మెగా ఫ్యాన్స్. విడుదలైన గంటలోనే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. దీంతో చికిరి సింప్లీ సూపర్ అంటున్నారు ఫ్యాన్స్.

