సాధారణంగా ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదం జరిగినా, రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నా.. ఆ తర్వాత హడావుడి సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇటీవల కర్నూలులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత రవాణా శాఖ కళ్ళు తెరిచింది. ప్రమాదాల తర్వాత మేల్కొనే రవాణా శాఖ అధికారులు.. ఇప్పుడు తనిఖీల పేరుతో జల్లేడ పడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రైవేట్ బస్సులపై దృష్టి సారించారు. నేడు హైదరాబాదులో తెలంగాణ రవాణా శాఖ ఒక డ్రైవ్ చేపట్టింది.
Also Read : బస్సు ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి..?
ఇందులో భాగంగా భద్రత ప్రమాణాలు పాటించని బస్సులను అధికారులు సీజ్ చేశారు. ఇక ప్రమాదం జరిగిన తర్వాత.. కనీస వైద్య సదుపాయాలు అందని బస్సుల పై కూడా చర్యలు తీసుకుంటున్నారు. దీనితో ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు జాగ్రత్త పడుతున్నాయి. ఫిట్నెస్ లేని బస్సుల ప్రయాణాలను క్యాన్సిల్ చేస్తున్నాయి. సాధారణంగా హైదరాబాద్, విజయవాడ నుంచి ఇతర రాష్ట్రాలకు నిత్యం ప్రైవేట్ బస్సులు నడుస్తూ ఉంటాయి. ట్రైన్ టికెట్ దొరకని వారు, ఆర్టీసీ బస్సులు నడవని ప్రాంతాలకు స్లీపర్ బస్సులలో ప్రయాణం చేస్తూ ఉంటారు.
Also Read : దారితప్పిన వారిపై వేటు ఖాయమా.. పార్టీ పెద్దలంటే లెక్క లేదా?
ఇక ఇప్పుడు ప్రైవేట్ బస్సులపై అధికారులు ఫోకస్ పెట్టడంతో ప్రయాణికులు బుక్ చేసుకున్న టికెట్లను క్యాన్సిల్ చేస్తున్నారు. బస్సులలో మార్పులు చేసేందుకు యాజమాన్యాలు సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటివరకు కనీస జాగ్రత్తలు తీసుకోని ట్రావెల్స్ యాజమాన్యాలు ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. ఇక వీకెండ్ కావడంతో భారీగా బుకింగ్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు బుక్ చేసుకున్న టికెట్లను క్యాన్సిల్ చేయడంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల వెంట పడుతున్నారు. మైసూర్, కోయంబత్తూర్, ఇటు ఉత్తరాది రాష్ట్రాలు సహా కొన్ని ప్రాంతాలకు రెగ్యులర్ గా ప్రైవేట్ బస్సులు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ బస్సులను క్యాన్సిల్ చేయడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.




