Friday, October 24, 2025 09:21 PM
Friday, October 24, 2025 09:21 PM
roots

కొత్త రోహిత్ ను చూసిన ఫ్యాన్స్.. పంథా మార్చేశాడు..!

క్రికెట్ చరిత్రలో.. ఓపెనర్ లకు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా డాషింగ్ బ్యాటింగ్ తో అభిమానులను సంపాదించుకుంటారు. మన భారత ఓపెనర్ ల డాషింగ్ బ్యాటింగ్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది. కృష్ణమాచారి శ్రీకాంత్, సిద్దు, వినోద్ కాంబ్లి, గంగూలి, సెహ్వాగ్, రోహిత్ శర్మ.. ఇలా కొంత లిస్టు ఉంది. వీరిలో ఇప్పుడు యాక్టివ్ గా ఉంది రోహిత్ శర్మ. రోహిత్ బ్యాటింగ్ అనగానే దూకుడుగా ఆడతాడు అనే గుర్తింపు ఉంటుంది. పవర్ ప్లేలో సాధ్యమైనన్ని పరుగులు చేస్తాడనే పేరు ఉంది.

Also Read : కొలికపూడి శ్రీనివాస్ సస్పెన్షన్ కోసం తొందరపడుతున్నాడా?

కానీ ఆస్ట్రేలియాతో రెండవ వన్డేలో రోహిత్ శర్మ ఆట తీరు చాలా భిన్నంగా కనపడింది. రోహిత్ అంటే.. పది బంతుల్లో 20 పరుగులు చేసే ఆటగాడు. కానీ తొలి పది పరుగులు చేసినప్పుడు అతని స్ట్రైక్ రేట్ 30.. 20 పరుగులకు 40.. ఇలా క్రమంగా స్ట్రైక్ రేట్ పెంచుతూ వెళ్ళాడు. సింగిల్స్ కు ప్రాధాన్యత ఇస్తూ రాణించాడు. ఆస్ట్రేలియా పేసర్ హెజిల్వుడ్ రోహిత్ ను అవుట్ చేసేందుకు పక్కాగా బౌలింగ్ చేసినా సరే అది సాధ్యం కాలేదు. బంతి పాతబడిన తర్వాత రోహిత్ దూకుడు పెంచి సిక్సులు కొట్టాడు.

Also Read : కంపెనీ ట్రిప్ కోసం హైదరాబాద్ వచ్చి.. కన్నీరు పెట్టిస్తున్న గోళ్ళ రమేష్ కుటుంబ విషాదం..!

ఇది చూసిన అభిమానులు షాక్ అయ్యారు. రోహిత్ ఆట తీరులో ఈ స్థాయిలో మార్పు ఊహించలేదు క్రికెట్ విశ్లేషకులు. అతని ఆట చూసిన ప్రేక్షకులు.. రోహిత్ వచ్చే వరల్డ్ కప్ వరకు ఆడే లక్ష్యంతో కొనసాగుతున్నాడని, అందుకే ఫిట్నెస్ పై కూడా దృష్టి పెట్టాడని అంటున్నారు. ఎక్కువ పరుగులు చేయాలి అంటే.. డాషింగ్ ఆట తీరు కరెక్ట్ కాదనే నిర్ణయానికి వచ్చేసాడు అనే అభిప్రాయం వినపడుతోంది. రెండు కీలక వికెట్లు పడిన సమయంలో రోహిత్ చాలా జాగ్రత్తగా ఆడటంపై ప్రసంశలు దక్కాయి. ఇక కోహ్లీ కూడా ఫాంలోకి రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

తెలుగు రాష్ట్రాలకు ముంచుకొస్తున్న...

భారత వాతావరణ శాఖ (IMD) తాజా...

దారితప్పిన వారిపై వేటు...

https://www.youtube.com/watch?v=O6ejiO-k3W8

ఆ ఇద్దరినీ వదలను.....

పదే పదే విమర్శలు.. ఒకరిపై ఒకరు...

కొలికపూడి శ్రీనివాస్ సస్పెన్షన్...

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు...

కంపెనీ ట్రిప్ కోసం...

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు...

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

పోల్స్