Wednesday, October 22, 2025 08:44 PM
Wednesday, October 22, 2025 08:44 PM
roots

నా తండ్రికి ఆమె భార్య కాదు.. మాగంటి గోపీనాథ్ కొడుకు సంచలనం

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రోజు రోజుకి ఆసక్తి పెంచుతుంది. ఎన్నికల్లో అభ్యర్థులకు సంబంధించి నిన్నటితో క్లారిటీ రాగా.. నేడు మరో విషయం సంచలనమైంది. ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. భారత రాష్ట్ర సమితి నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బిజెపి నుంచి దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మాగంటి సునీత వ్యవహారం సంచలనంగా మారింది.

Also Read : బ్రేకింగ్: డీఎస్పీకి అండగా రఘురామ..? పవన్ కు ఏం చెప్పారో తెలియదు..!

ఎన్నికల్లో మొత్తం 117 మంది నామినేషన్ దాఖలు చేయడం ఓ సంచలనం కాగా.. నేడు మాగంటి సునీత.. అసలు తన తండ్రికి చట్ట ప్రకారం భార్య కాదంటూ.. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమారుడు.. మాగంటి తారక్, ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ లేఖలో ఆసక్తికర విషయాలను తారక్ ప్రస్తావించారు. తాను మాజీ ఎమ్మెల్యే కుమారుడని, తన తల్లి నుంచి మాగంటి గోపీనాథ్ విడాకులు తీసుకోలేదని పేర్కొన్నాడు. తన తండ్రి మరణించే వరకు వివాహ బంధం చెల్లుబాటు అయినట్లు తెలిపాడు. ప్రస్తుతం భార్యగా చెప్తున్న మాగంటి సునీత, సహజీవనం మాత్రమే చేసినట్లు.. లేఖలో సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Also Read : జోగి రమేష్ సంగతేంటి..? ఇంకెందుకు ఆలస్యం..?

శాశ్వత బంధంలో ఉన్న భార్య కుమారుడని తానేనని.. లీగల్ వారసత్వం తనదేననీ పేర్కొన్నాడు. కానీ మాగంటి సునీత తనను చట్ట ప్రకారం భార్యగా చెబుతూ.. తప్పుడు ఆఫిడవిట్లు, డాక్యుమెంట్లను సమర్పించారని.. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. కాగా మాగంటి గోపీనాథ్, 1988 ఏప్రిల్ 29న కొసరాజు మాలినీ దేవిని వివాహం చేసుకున్నారు. అయితే తన తల్లికి విడాకులు ఇవ్వకుండానే సునీతతో సహజీవనంలో ఉన్నట్లు తారక్ లేఖలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. సునీత అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలని విజ్ఞప్తి చేశాడు. అయితే ఇప్పటికే రిటర్నింగ్ అధికారి సునీత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం గమనార్హం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

బ్రేకింగ్: డీఎస్పీకి అండగా...

తెలుగు రాష్ట్రాల్లో జూదం, కోడి పందాలు...

ఎమ్మెల్యే బావమరిదిని కంట్రోల్...

రాజకీయ నాయకుల అవినీతి వ్యవహారాల విషయంలో...

జోగి రమేష్ సంగతేంటి..?...

ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్యం కేసు వెనకడుగు...

డీఎంకే నేతలతో కలిసి...

ఆంధ్రప్రదేశ్ కల్తీ మధ్య వ్యవహారానికి, తమిళనాడు...

పర్యటన తెచ్చిన తంటాలు..!

ఒక పర్యటన ఇప్పుడు సిక్కోలు జిల్లా...

శ్రీలేఖకు టీడీపీ క్యాడర్...

రాజకీయాల్లో ప్రభుత్వ అధికారుల పాత్ర కాస్త...

పోల్స్