ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం వ్యవహారం లో చోటుచేసుకుంటున్న పరిణామాలు వైసిపిని రోజురోజుకీ మరింత ఇబ్బంది పెడుతున్నాయి. మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే పలువురు నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేయగా.. క్రమంగా విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ కేసులో ముఖ్యంగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి సహా కొంతమంది నిందితుల విచారణలో పలు ఆసక్తికర విషయాలను సిట్ గుర్తించింది.
Also Read : మా మీద నీ పెత్తనం ఏమిటీ..!
ఇదే సమయంలో జాతీయ దర్యాప్తు బృందం ఈ డి కూడా దేశవ్యాప్తంగా సోదాలు జరిపింది. ఇక తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది. మిథున్ రెడ్డి నివాసాల్లో పెద్ద ఎత్తున అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. మిధున్ రెడ్డి సన్నిహితుల నివాసాల్లో కూడా పెద్ద ఎత్తున తనిఖీలు జరిగాయి. వచ్చేవారం మిధున్ రెడ్డి అమెరికా వెళ్ళనున్న నేపథ్యంలో.. ఈ సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ఈ సోదాల్లో ఏవైనా ఆధారాలు దొరికాయా అనే దానికి సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు.
Also Read : ఎమ్మెల్యే తీరుపై క్యాడర్ ఫుల్ ఫైర్..!
అయితే ఈ సోదాలపై వైసీపీ అనుకూల మీడియా పెదవి విరుస్తోంది. మిథున్ రెడ్డిని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వేధిస్తున్నారు అంటూ ఆరోపిస్తోంది. ఇటీవల నకిలీ మద్యం కేసులో సిబిఐ విచారణ కోరుతూ మిథున్ రెడ్డి కేంద్ర హోం మంత్రికి ఇటీవల లేఖ రాసిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి అని ఆరోపిస్తోంది. అమెరికా పర్యటనకు సంబంధించి కోర్టు అనుమతి కోరుతూ పిటీషన్ దాఖలు చేయగా.. అనుమతి వచ్చే సమయంలో ఈ సోదాలు కలకలం రేపుతున్నాయి. అయితే కీలక పత్రాలను అమెరికా తరలించే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నట్లుగా భావిస్తున్నారు.