గత కొన్నాళ్లుగా ట్రిపుల్ ఐటీల్లో ఆహార నాణ్యత విషయంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రాజకీయ పార్టీలు కూడా ఆరోపణలు చేసే పరిస్థితి. ట్రిపుల్ ఐటీ లో సీటు వచ్చిన సంతోషం కంటే భోజనం బాగాలేదు అనే బాధ విద్యార్థుల్లో ఎక్కువగా ఉంది. ఎందరో విద్యార్థులు చదువును కూడా వదిలేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ కొందరు బలవంతంగా చదువు మానేశారు.
Also Read : ఈ సారైన ముహూర్తం బలంగా ఉందా..?
అయితే ఈ అంశానికి సంబంధించి గతంలో మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు ఓ హామీ ఇచ్చారు. ట్రిపుల్ ఐటీల్లో ఆహార బాధ్యతను అక్షయపాత్ర ఫౌండేషన్ కు ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం అక్షయపాత్ర ఫౌండేషన్ అన్న క్యాంటీన్లకు ఫుడ్ సరఫరా చేస్తోంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. కృష్ణ పుష్కరాల సమయంలో కూడా అక్షయపాత్ర ఫౌండేషన్ నాణ్యమైన భోజనం సరఫరా చేసింది. దీనితో ఏపీ ప్రభుత్వం మరోసారి అన్నా క్యాంటీన్లకు అక్షయపాత్ర ఫౌండేషన్ భోజనం సరఫరా చేయాలని బాధ్యతలు అప్పగించింది.
Also Read : వన్డే సీరీస్ కు ముందు ఆసిస్ కు షాక్..!
తక్కువ ధరకే భోజనం అందించిన సరే విమర్శలు రాకుండా జాగ్రత్తపడుతోంది అక్షయపాత్ర ఫౌండేషన్. ఇక ఇప్పుడు ప్రముఖ విద్యాసంస్థలైనటువంటి ట్రిపుల్ ఐటీల్లో భోజనం అందించే బాధ్యతను ఇదే సంస్థకు అప్పగించారు మంత్రి నారా లోకేష్. దీనితో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాటను మంత్రి లోకేష్ నిలబెట్టుకున్నారని కొనియాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది విద్యార్థులు ఈ సంస్థలలో విద్యను అభ్యసిస్తూ ఉంటారు. లోకేష్ తీసుకున్న నిర్ణయంతో ఇకనుంచి అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజన సరఫరా జరగనుంది.