విరాట్ కోహ్లీ వర్సెస్ ఆస్ట్రేలియా.. దాదాపు 15 ఏళ్ల నుంచి ఈ మాట క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తూ ఉంటుంది. విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో సాధించిన రికార్డులు.. అక్కడి బౌలర్ల విషయంలో అతని దూకుడు అన్నీ ఒక సంచలనమే. దిగ్గజ బౌలర్ల నుంచి చిన్న చిన్న బౌలర్ల వరకు అందరినీ ఒక ఆట ఆడుకున్నాడు కోహ్లీ. దీనితో ఆస్ట్రేలియాతో భారత్ మ్యాచ్ ఆడుతుంది అంటే కోహ్లీ ఉండాల్సిందే అన్నట్లు పరిస్థితి మారింది. దానికి తోడు ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు కూడా విరాట్ కోహ్లీని విపరీతంగా అభిమానిస్తూ ఉంటారు.
Also Read : తమిళ నాడు స్టాలిన్, వైసీపీ చీఫ్ జగన్ కు బాంబు వార్నింగ్..!
ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ విషయంలో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో తనదైన ముద్ర వేశాడు. అయితే ఈ ఏడాది టెస్ట్ క్రికెట్ నుంచి కోహ్లీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు ఈ ఢిల్లీ ఆటగాడు. త్వరలో భారత్ ఆస్ట్రేలియా తో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ వన్డే సిరీస్ లో విరాట్ కోహ్లీ కూడా ఆడతాడు. దీనితో అతన్ని చూసేందుకు.. ఆస్ట్రేలియాలో అతని చివరి పర్యటనను వీక్షించేందుకు పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు ఆస్ట్రేలియా చేరుకుంటున్నారు. మరో 16 రోజుల్లో ఈ సీరిస్ మొదలవుతుంది.
Also Read : యూజర్లకు గుడ్ న్యూస్.. యూపీఐ నుంచి ఈఎంఐ పేమెంట్..!
దీనితో ఆస్ట్రేలియాకు భారీగా వెళ్తున్నారు భారత క్రికెట్ అభిమానులు. టూరిస్ట్ వీసాలు వచ్చినవాళ్లు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నట్లు సమాచారం. ఇక అక్కడి మైదానాల్లో కూడా టికెట్లు భారీగా అమ్ముడుతున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు చెప్తుంది. అటు రోహిత్ శర్మ కూడా ఆడటంతో అతని అభిమానులు కూడా భారీగా మైదానానికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో భారతీయులు ఎక్కువగా ఉంటారు. దీనితో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాంటిది విరాట్ కోహ్లీ ఆడుతున్నారు అంటే అభిమానులు పెద్ద ఎత్తున మైదానాలకు వస్తూ ఉంటారు. ఆస్ట్రేలియా వెళ్లిన వాళ్లలో ఎక్కువగా వర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగులే ఉన్నట్లు జాతీయ మీడియా చెప్తుంది.