Sunday, October 19, 2025 08:05 PM
Sunday, October 19, 2025 08:05 PM
roots

బెజవాడలో తగ్గని రద్దీ.. ఆశ్చర్యపోతున్న అధికారులు

విజయవాడలో దసరా ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించింది దేవదాయశాఖ. దేశం నలమూలాల నుంచి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో క్యూలైన్ లు భక్తులతో నిండిపోయాయి. ప్రతిరోజు సగటున లక్షమందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సాధారణంగా గతంలో మూలా నక్షత్రం రోజున ఎక్కువగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి అత్యంత ఆశ్చర్యం కలిగిస్తోంది. దసరా రోజున ఎలాగో భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది.

Also Read : యూజర్లకు గుడ్ న్యూస్.. యూపీఐ నుంచి ఈఎంఐ పేమెంట్..!

కానీ దసరా ముగిసిన తర్వాత కూడా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రెండు వైపుల నుంచి అమ్మవారిని దర్శించుకునే విధంగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. కానీ పండుగ తర్వాత కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడంతో.. పోలీసులు ఎక్కడికి అక్కడ కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి దసరా తర్వాత విరుముళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి భవానీ భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. కానీ భవాని భక్తులతో పాటుగా సాధారణ భక్తులు కూడా భారీగా క్యూలైన్లలో వేచి ఉన్నారు.

Also Read : మిథున్ రెడ్డికి మద్దతు ఎక్కడ..? సైలెంట్ గా క్యాడర్..!

ఇక భవాని మాలలు ధరించి వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాటు చేసింది దేవాదాయ శాఖ. కృష్ణా నదిలో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకునే వారికోసం కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. దేవాదాయ శాఖ అంచనాల ప్రకారం రాబోయే మూడు రోజుల్లో కనీసం 2 లక్షల 50 వేల నుంచి మూడు లక్షల మంది పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉదయం రెండు గంటల నుంచి క్యూ లైన్ లలో భక్తులు బారులు తీరారు. దీనితో విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్ అత్యంత రద్దీగా మారాయి. ఈ స్థాయిలో తాము ఎప్పుడూ భక్తులను చూడలేదు అంటున్నారు విజయవాడ వాసులు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్