కొబ్బరి నీళ్ళు” ఎందరో ఫిదా అయిపోయే సహజ పానీయం. రోజుకో కొబ్బరి బొండం, లేదా ఓ లీటర్ కొబ్బరి నీళ్ళను ప్రేమించే వాళ్ళు ఎందరో.. కాలంతో సంబంధం లేకుండా ఇష్టపడుతూ ఉంటారు. మరి కొబ్బరి నీళ్ళు తాగితే బరువు తగ్గుతారా..? దీనిపై ఎందరికో సందేహాలు. అసలు నిజం ఎంత..? కొబ్బరి నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. హైడ్రేట్ గా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. తక్కువ కేలరీల పానీయం కొబ్బరి నీరు. ఇక ఎలక్ట్రోలైట్లకు, ముఖ్యంగా పొటాషియం, సోడియం మరియు మెగ్నీషియంకు మంచి మూలం.
Also Read : పార్టీ మారారా లేదా.. బీఆర్ఎస్ కొత్త గేమ్ ప్లాన్..!
ఇందులో తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్ సి, పలు రకాల బి విటమిన్లు వంటి వివిధ విటమిన్లు కూడా ఉంటాయి. తక్కువ కేలరీలు ఉండటంతో బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి అనేది చాలా మంది భావన. అది ఖచ్చితంగా కొంత వరకు నిజమే అంటున్నారు నిపుణులు. బరువు తగ్గడం విషయంలో, కొబ్బరి నీరు ఎంతో ఉపయోగకరం. జ్యూస్ లు లేదా షుగర్ ఉండే షోడాల కంటే ఇది ఎంతో మంచిది. కొబ్బరి నీరు తాగితే హైడ్రేట్ గా ఉండటం ఒకటి అయితే, అతి తినకుండా కంట్రోల్ చేస్తుంది. అయితే ప్రత్యక్షంగా ఇది బరువు తగ్గించదు.
Also Read : ప్రముఖ కంపెనీతో టచ్ లోకి లోకేష్.. గుజరాత్ వర్సెస్ ఏపీ..?
ఆహరం మానేసి కొబ్బరి నీళ్ళు తాగితే ప్రయోజనం ఉండదు. వ్యాయామం చేసిన తర్వాత కొబ్బరి నీళ్ళు తాగితే మంచి ఫలితం ఉంటుంది. అంతే గాని ఆహారం మానేసి కొబ్బరి నీళ్ళు మాత్రమే తాగడం కరెక్ట్ కాదు. అంతేకాకుండా, కొబ్బరి నీళ్లలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి, ఇవి శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయ పడతాయి. ఒక కప్పు కొబ్బరి నీళ్లలో 40-50 కేలరీలు ఉంటాయి. రోజుకు ఒక పావు లీటర్ కొబ్బరి నీళ్ళు ఎంతో ఉపయోగం. మూత్రపిండాలు, గుండె లేదా రక్తంలో చక్కెర సమస్యలు ఉంటే కొబ్బరి నీళ్ళ సమస్యలు ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీలో రాళ్ళు ఉన్న వారికి కొబ్బరి నీళ్ళు మంచిది. అలాగే బీపీ కంట్రోల్ చేయడంలో కూడా ఉపయోగపడతాయి.