Sunday, September 20, 2026 01:14 AM
Sunday, September 20, 2026 01:14 AM

11 వేల ఉద్యోగాలు తీసేసిన ఐటీ దిగ్గజం

ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్.. ఇప్పుడు ఈ టెక్నాలజీ గురించి ఐటీ రంగంలో ఉన్న వారికి చెమటలు కక్కిస్తోంది. సినిమా రోజు రోజుకు వరస్ట్ గా మారడంతో ఉద్యోగాలు చేసే వారు ఉలిక్కి పడుతున్నారు. ఇటీవల టీసీఎస్ భారీగా ఉద్యోగులను తొలగించగా ఇప్పుడు మరో ప్రముఖ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. యాక్సెంచర్‌ లో భారీగా ఉద్యోగులను తొలగించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మరింతగా వాడుకునేందుకు నిర్ణయించిన సంస్థ.. ఉద్యోగులను తొలగిస్తూ షాక్ లు ఇస్తోంది.

Also Read : అమరావతికి కొత్త కళ..!

గత మూడు నెలల్లో కంపెనీ కనీసం 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. బిజినెస్ ఇన్‌సైడర్‌ నివేదిక ప్రకారం.. భారీగా ఉద్యోగులను సంస్థ తొలగిస్తున్నట్టు తెలిపింది. త్వరలోనే మరికొందరికి షాక్ తప్పదు అని హెచ్చరించింది. స్కిల్ తక్కువగా ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నామని కంపెనీ చెప్తోంది. ఇక ఏఐ గురించి ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నామని, మరింత సమర్ధవంతంగా వాడుకుంటామని తెలిపింది. గత ఆరు నెలల్లో, యాక్సెంచర్ ఏఐ ద్వారా 2.6 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది.

Also Read : ర్యాపిడో ఇలా కూడా వాడుతున్నారా.. వామ్మో..!

ఈ తాజా నిర్ణయం వల్ల కంపెనీ దాదాపుగా భారీగా వ్యయాలను తగ్గించుకుంది. ఈ నిర్ణయం తర్వాత మే నుంచి ఆగస్టు మధ్య ఉద్యోగుల సంఖ్య 7,91,000 నుండి 7,79,000 కు తగ్గిందని సదరు నివేదిక పేర్కొంది. అయితే, తొలగింపులు మాత్రమే తమ భవిష్యత్తు ప్రణాలికలకు కొలమానం కాదని.. కీలక నిర్ణయాలు తీసుకుంటామని సంస్థ చెప్తోంది. మార్కెట్ లో మరింత పెట్టుబడి పెట్టేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు తెలిపింది. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను తొలగించిందని, కానీ కంపెనీ కొత్త ఉద్యోగులను కూడా నియమించుకుందని తాము కూడా అదే చేస్తామని యాక్సెంచర్ అంటోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్