మీ కంటే స్కూల్‌లో పిల్లలు బెటర్ కదా.. ఈ మాటే ఇప్పుడు బాగా వినిపిస్తోంది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిన్నటితో ముగిశాయి. ఈ సమావేశాల్లో ఎన్నో ఆసక్తి కరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు దూరంగా ఉన్నారు. ప్రతిపక్ష హోదా కావాలంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టుబట్టారు. అది సాధ్యం కాదని సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తేల్చి చెప్పారు. దీంతో మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ జగన్.
Also Read : చంద్రబాబు సీరియస్.. బాలయ్య క్షమాపణ చెప్తారా..?
ఇక సభకు సభ్యులు దూరంగా ఉన్నారని స్పీకర్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు ఎందుకు రావటం లేదో చెప్పాలన్నారు. సభకు తప్పకుండా రావాలని ఆదేశించారు కూడా. ఇక కీలక బిల్లులపై చర్చ జరిగింది. జనసేన, టీడీపీ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తాయా అనేలా కొన్ని అంశాలు ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ శాఖ గురించి బోండా ఉమ, పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీద బుచ్చయ్య చౌదరి విమర్శలు.. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పైన బాలకృష్ణ వ్యాఖ్యలు.. ఇవి పెద్ద దుమారం రేపాయి.
Also Read : హైదరాబాద్ వరదలు.. సైనికులను పవన్ కీలక సూచనలు..!
ఇక మండలిలో అయితే వైసీపీ సభ్యుల ఆరోపణలు.. టీడీపీ, బీజేపీ, జనసేన నేతల కౌంటర్లు.. ఇలా సాగింది. అయితే ఈ సమావేశాల్లో మండలిలో జరిగిన రెండు అంశాలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇందులో ప్రధానమైంది శాసనసభకు, శాసన మండలికి తేడా చూపిస్తున్నారనే మాట. ఎమ్మెల్యేలు దుర్గ గుడిలోకి నేరుగా వెళ్తున్నారని.. కానీ ఎమ్మెల్సీలను అస్సలు గౌరవించటం లేదన్నారు. అలాగే భోజనం విషయంలో కూడా తేడా చూపిస్తున్నారని ఆరోపించారు. ఇక చివరి రోజు అయితే మండలి ఛైర్మన్‌కు ఇచ్చే కాఫీ, టీ బాగలేవనే అంశాన్ని చర్చించారు. ఇలా వేరుగా ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు.
ఈ అంశం బయటకు రావడంతో.. పెద్దల సభలో ఇలా కాఫీ, టీల గురించి చర్చిస్తారా.. మీ దృష్టిలో ఇవే అసలైన ప్రజా సమస్యలా..? అని ప్రశ్నిస్తున్నారు. ఇది పెద్దల సభ అనే విషయాన్ని మర్చిపోతే ఎలా వ్యాఖ్యానిస్తున్నారు.