భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనగానే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అలాంటిది రెండు దేశాల మధ్య ఫైనల్ మ్యాచ్ అనగానే.. అభిమానుల్లో మరింత ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం జరుగుతోన్న ఆసియా కప్ లో రెండు జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. ఇప్పటికే ఈ రెండు జట్లు టోర్నీలో రెండు సార్లు తలపడగా.. ఫైనల్ లో మూడవ సారి ఆడనున్నాయి. ఇక ఆదివారం జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్ విషయంలో భారత్ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. అటు పాకిస్తాన్ కూడా ఈ మ్యాచ్ ను మరింత సీరియస్ గా తీసుకుంది.
Also Read : భారత జట్టులో అతనిపై ఎందుకీ వివక్ష..?
ఈ నేపధ్యంలో జట్టులో కీలక మార్పులు చేస్తోంది పాక్ జట్టు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ సీనియర్ ఆటగాడు.. బాబర్ ఆజంను తిరిగి టి20 జట్టులోకి తీసుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. బాబర్ చివరిసారిగా డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్ ఆడాడు. అతనితో పాటు మహ్మద్ రిజ్వాన్ ను వారి స్ట్రైక్ రేట్ ను దృష్టిలో పెట్టుకుని జట్టు నుంచి పక్కన పెట్టారు. కోచ్ మైక్ హెస్సన్, సెలెక్టర్ అకిబ్ జావేద్ కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు ఆసక్తి చూపించారు.
Also Read : ఎమ్మెల్యేలు ఆ పనులు చేయాలి.. చంద్రబాబు కీలక ప్రసంగం
అయితే సీనియర్ ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించిన తర్వాత పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్ ఆందోళన కలిగిస్తోంది. ఆసియా కప్ ఫైనల్‌కు అర్హత సాధించినప్పటికీ, పాకిస్తాన్ ప్రదర్శన అంతంత మాత్రమే. దీనితో ఫైనల్ మ్యాచ్ కు ముందు సీనియర్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నా.. కొన్ని కారణాలతో యాజమాన్యం వెనకడుగు వేస్తోంది. కనీసం బాబర్ ఆజంను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఆసియా కప్‌లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ మూడు విజయాలు సాధించింది.