Tuesday, October 21, 2025 07:31 PM
Tuesday, October 21, 2025 07:31 PM
roots

4 రోజుల పాటు ఆ సినిమాకు బ్రేక్..!

సినీ హీరోల మధ్య పోటీ సర్వసాధారణం. రికార్డుల కోసం, కలెక్షన్ల కోసం ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటారు. బాలీవుడ్‌లో ఇది బాగా ఎక్కువ కూడా. ఇక 90ల్లో అయితే హీరోల సినిమాలు పోటీ పడి మరీ విడుదల చేసే వాళ్లు. ఇక కొన్ని సినిమాల విషయంలో అయితే నిర్మాతలు పోటీ పడి మరీ ఎక్కువ స్క్రీన్స్ బుక్ చేసుకుని.. పోటీ సినిమాకు కలెక్షన్ తక్కువ వచ్చేలా కూడా చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టాలీవుడ్ అంతా ఒక తాటిపైనే ఉంది.

Also Read : చంద్రబాబు కోటి రూపాయలు కట్టాలి.. సీఐ సంచలన డిమాండ్

ఏదైనా ఒక పెద్ద సినిమా విడుదల అవుతుందని తెలిస్తే.. దాని కోసం మిగిలిన సినిమాలు రిలీజ్ వాయిదా వేస్తారు కూడా. పెద్ద హీరో సినిమాకు లైన్ క్లియర్ చేస్తున్నారు. ఓజీ సినిమా కోసం అఖండ 2 వాయిదా వేశారనేది బహిరంగ రహస్యం. ఓజీ సినిమాను దర్శక నిర్మాతలు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. మరి కొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు ఇప్పటికే భారీ పబ్లిసిటీ వచ్చేసింది. టికెట్ బుకింగ్ కూడా దాదాపు నాలుగు రోజుల పాటు హౌస్ ఫుల్.

ఓజీ సినిమా కోసం ఇప్పటికే విజయవంతంగా ప్రదర్శితమవుతున్న మరో సినిమాను నిర్మాత పక్కన పెట్టారు. ఈ నెల 12వ తేదీ విడుదలైన మిరాయి సినిమా సూపర్ హిట్ టాక్‌తో నడుస్తోంది. తేజ సజ్జా, మంచు మనోజ్ కాంబోలో వచ్చిన మిరాయికి రిపీట్ ఆడియన్స్ కూడా వస్తున్నారు. ప్రేక్షకుల కోరిక మేరకు కొత్తగా మరో పాట కూడా జత చేశారు దర్శకులు. అయితే తాజాగా మిరాయి నిర్మాతలు కీలక ప్రకటన చేశారు. ఓజీ సినిమా కోసం మిరాయి థియేటర్లు ఇచ్చేందుకు ఓకే చెప్పారు.

Also Read : ఎక్కడ దాక్కున్నా వదలను.. జగన్ సంచలన కామెంట్స్

బెనిఫిట్ షో తో పాటు మూడు రోజుల పాటు ఓజీ కోసం థియేటర్లను వదిలేందుకు నిర్మాతలు అంగీకరించారు. ఆ తర్వాత ఆదివారం లేదా సోమవారం నుంచి మిరాయి సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని దర్శక నిర్మాతలు తెలిపారు. దసరా సీజన్ కావడంతో.. అందరికీ సెలవులు. కాబట్టి.. ఈ 3 రోజులు ఓజీ చూసిన ప్రేక్షకులు.. ఆ తర్వాత మిరాయి కోసం థియేటర్‌కు వస్తారనేది నిర్మాతల భావన. బడా సినిమా కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవటం పట్ల టాలీవుడ్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

పోల్స్