Friday, September 12, 2025 12:35 AM
Friday, September 12, 2025 12:35 AM
roots

దసరా నవరాత్రులకు శరవేగంగా ఏర్పాట్లు.. అధికారుల పరిశీలన

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. 11 రోజులు పాటు భక్తులు పెద్ద ఎత్తున దుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి రానున్నారు. ఈ ఏడాది సుమారు 20 లక్షల మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో విజయవాడ ఉత్సవ్ కూడా గ్రాండ్‌గా నిర్వహిస్తోంది ప్రభుత్వం. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున విజయవాడ వస్తారని అధికారులు భావిస్తున్నారు.

Also Read : ఇదేంది కేటిఆర్..? ఆ గర్జన ఎక్కడ..?

దుర్గ గుడి పరిసరాల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీషా, విజయవాడ మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, పోలీస్ అడిషనల్ రామకృష్ణ, దుర్గ గుడి ఈవో శీనానాయక్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. దసరా ఏర్పాట్ల పురోగతిని క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. దసరా ప్లాన్ పరిశీలన, క్యూ లైన్లకు అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి, క్యూ లైన్లలోకి క్రమంగా సులువుగా ప్రవేశించేందుకు మార్గాలను సూచించారు.

భక్తుల రద్దీని నియంత్రించడానికి ఏర్పాటు చేయనున్న క్యూ లైన్లను అధికారులు పరిశీలించారు. వినాయకుడి గుడి, సీతమ్మవారి పాదాలు, ఆర్‌ఈ చైనావాల్, టోల్‌గేట్, ఘాట్ రోడ్ మీదుగా అమ్మవారి ఆలయం వరకు విస్తరిస్తున్నారు. గతంలో ఉన్న సమస్యలను అధిగమించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దసరా ఉత్సవాల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల పార్కింగ్ కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పార్కింగ్ స్థలాల గుర్తింపు, ట్రాఫిక్ మళ్లింపు మార్గాలపై పోలీస్ అధికారులు సమీక్షించారు.

Also Read : లోకేష్ అదుర్స్.. వార్ రూమ్ లోనే మంత్రులు

క్యూ లైన్లలో భక్తులకు మంచినీరు, పాలు, అన్నప్రసాదం అందించే ఏర్పాట్లు చేయనున్నారు. మరుగుదొడ్లు, వైద్య సహాయ కేంద్రాలు, సమాచార కేంద్రాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. గతేడాది అనుభవాల ఆధారంగా, భద్రతా చర్యలను మరింత బలోపేతం చేస్తున్నారు. ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, ఘాట్‌లలో సీసీ టీవీ కెమెరాల నిఘా పెంచనున్నారు.

ఆన్‌లైన్‌లో స్వచ్ఛంద సేవకులకు నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆన్‌లైన్ వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకొని పనిచేయాలని సూచించారు. ఆలయ పరిసరాలు, నది ఘాట్‌లు, క్యూ లైన్లలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. భక్తులకు అందించే ప్రసాదాలు, అన్నప్రసాదం నాణ్యతలో రాజీపడేది లేదన్నారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలను విజయవంతం చేయడానికి, భక్తులకు మెరుగైన దర్శనం, సౌకర్యాలు కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్