Saturday, October 25, 2025 09:18 PM
Saturday, October 25, 2025 09:18 PM
roots

అసలు బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది..?

తెలంగాణ అంటే కేసీఆర్… కేసీఆర్ అంటే తెలంగాణ అనేలా ముద్ర వేసుకున్నారు. ఒక దశలో తెలంగాణ బాపూ అని గొప్పగా అనిపించుకున్నారు కూడా. వరుసగా రెండుసార్లు అధికారం అనుభవించిన కేసీఆర్‌కు ఓడిన తర్వాత కష్టాలు మొదలయ్యాయి. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దృష్టి పెట్టింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులు జైలులో ఉన్నారు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఇప్పటికే సీబీఐ విచారణకు ఆదేశించింది. అలాగే ఫార్మూలా ఈ-రేస్ కేసులో కూడా భారీగా అవినీతి జరిగినట్లు ఇప్పటికే కేసు నమోదు చేసింది కాంగ్రెస్ సర్కార్.

Also Read : ఆ విషయంలో టీడీపీ ఫెయిల్ అయినట్లే..!

హ్యాట్రిక్ ఖాయమని గొప్పగా చెప్పుకున్న కేసీఆర్‌కు వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి వస్తే ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పాలనే భయంతో సభకు కూడా రావటం లేదనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ. ఇదే సమయంలో బీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే హరీష్, సంతోష్ పైన ఆరోపణలు చేసిన కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆమె కూడా పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి.. ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు.

అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక విషయంపై విస్తృతంగా చర్చ నడుస్తోంది. హరీష్ రావుపైన కవిత ఆరోపణల వెనుక కేసీఆర్ ప్లాన్ ఉందనే మాట బలంగా వినిపిస్తోంది. పార్టీలో ఆధిపత్యం కోసం కేటీఆర్, హరీష్ మధ్య పోటీ ఉందనే ప్రచారం జోరుగా నడిచింది. అయితే ఆ విషయంపై ఇరువురు నేతలు కూడా ఇప్పటికీ ఖండించలేదు. కానీ పైకి మాత్రం కలిసే తిరుగుతున్నారు. అయితే హరీష్ రావు చాపకింద నీరులా పార్టీలో చీలిక తీసుకువస్తున్నారనే మాట బాగా వినిపిస్తోంది.

Also Read : రేపే ఉప రాష్ట్రపతి ఎన్నిక.. ఇవే లెక్కలు..

బీఆర్ఎస్ అంటే కేసీఆర్.. తర్వాత కేటీఆర్, కవిత అనేది ఆ పార్టీ నేతల మాట. అందుకే కుటుంబ పార్టీగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో హరీష్‌ను పక్కకు తప్పించేందుకు కేసీఆర్, కేటీఆర్, కవిత ప్లాన్ చేశారనే మాట వినిపిస్తోంది. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కేసీఆర్ పేరు వస్తుంటే.. హరీష్ ఎందుకు మాట్లాడటం లేదని కవితతో ప్రశ్నించారనే మాట వినిపిస్తోంది. ఈ విషయంలో కేసీఆర్‌కు ఏ పాపం తెలియదని.. అవినీతికి హరీష్ మాత్రమే కారణమనేది కవిత ఆరోపణ. అంటే.. హరీష్ పైన కవిత ఆరోపణల వెనుక కేసీఆర్, కేటీఆర్ ఉన్నారనేది పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట. బీఆర్ఎస్‌ నుంచి హరీష్‌ను బయటకు పంపేందుకే కవితతో ఈ తరహా వ్యాఖ్యలు చేయిస్తున్నారనే మాట వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

సస్పెండ్ చేస్తే తిరువూరు...

తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది....

పులివెందులకు కేంద్రం గుడ్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

వరల్డ్ కప్‌కు మేం...

గత నాలుగు నెలల నుంచి భారత...

రోహిత్ రికార్డుల మోత.....

భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓపెనర్...

ఒక్కొక్కరికి కోటి ఇచ్చే...

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతి...

హైడ్రా కమీషనర్ రంగనాథ్...

హైదరాబాద్‌లోని హైడ్రా కమీషనర్ రంగనాథ్ శుక్రవారం...

పోల్స్