Friday, September 12, 2025 05:07 PM
Friday, September 12, 2025 05:07 PM
roots

నాగబాబు ఏమయ్యారు..? పవన్ తో గ్యాప్ వచ్చిందా?

జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత.. ఆ పార్టీలో బాగా ఫేమస్ అయిన వ్యక్తుల్లో ఎమ్మెల్సీ నాగబాబు ఒకరు. ఆ పార్టీకి రాజకీయ బలం ఉన్నా లేకపోయినా దూకుడుగా విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండేవారు నాగబాబు. 2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలైన ఆయన, ఆ తర్వాత పార్టీ కోసం కాస్త గట్టిగానే కష్టపడ్డారు. 2024 ఎన్నికల్లో కూడా పార్టీ నేతలతో నిత్యం సమన్వయం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ కు తన వంతుగా సహకరించారు. దీనితో జనసేన పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించింది.

Also Read : కర్మ సిద్ధాంతం.. వైరల్ అవుతోన్న రేవంత్ కామెంట్స్

మంత్రి పదవి కూడా ఇస్తారు అనే ప్రచారం సైతం జరిగింది. దీనిపై పవన్ కళ్యాణ్ తో పాటుగా తెలుగుదేశం పార్టీ కూడా అధికారిక ప్రకటన చేసింది. అయితే అనూహ్యంగా నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వటం లేదు అనే వార్తలు వచ్చాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది మార్చిలోనే నాగబాబు క్యాబినెట్లో అడుగు పెట్టాల్సి ఉంది. కానీ పిఠాపురం సభలో ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చేందుకు నిరాకరించడంతో పవన్ కళ్యాణ్ కూడా ఒత్తిడి చేయలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.

అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు గానీ నాగబాబు మాత్రం.. సైలెంట్ అయిపోయారు. పిఠాపురం నియోజకవర్గంలో సైతం పవన్ కళ్యాణ్ నాగబాబును దూరం పెట్టారు. ఇదే సమయంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మను పవన్ కళ్యాణ్ దగ్గర చేసుకున్నారు. నియోజకవర్గంలో విభేదాలకు నాగబాబు కారణం అనే అభిప్రాయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ఆయనను దూరం పెట్టినట్లు జనసేన వర్గాల్లో ప్రచారం కూడా ఉంది.

Also Read : రాజీనామాకు సిద్ధమైన అక్క శిష్యులు..? గులాబీ పార్టీలో అలజడి

ఇటీవల విశాఖలో జరిగిన పార్టీ సమావేశంలో కూడా నాగబాబు ఆక్టివ్ గా కనపడలేదు. ఆయన ప్రసంగానికి మీడియా కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అటు జనసేన కార్యకర్తలు కూడా నాగబాబు గురించి ఎక్కడ హడావుడి చేయలేదు. దీంతో పవన్ కళ్యాణ్ కు నాగబాబుకు మధ్య విభేదాలు తలెత్తేయి అనే ప్రచారం సైతం జరుగుతుంది. దీనికి కారణం నాగబాబు దూకుడు వైఖరి అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. అటు మంత్రి పదవి విషయంలో కూడా.. చంద్రబాబు నిర్ణయానికి పవన్ కళ్యాణ్ ఓటు వేశారు. మరి నాగబాబు ఎప్పుడు బయటకు వస్తారో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

పోల్స్