Friday, September 12, 2025 06:22 AM
Friday, September 12, 2025 06:22 AM
roots

ట్రంప్ తో ఏం మాట్లాడానో.. మోడీకి చెప్పా.. పుతిన్ కామెంట్స్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని.. భారత్ – రష్యా – చైనా దేశాల మధ్య స్నేహం, వాణిజ్యం క్రమంగా బలపడుతోంది. ఈ మూడు దేశాలను విడదీయాలని ట్రంప్ ప్రయత్నాలు చేయగా అది బెడిసి కొట్టి.. స్నేహ రాగం ఆలపిస్తున్నాయి ఈ మూడు దేశాలు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ షాంగై పర్యటన విజయవంతం కావడంపై అమెరికా ఇప్పటికే తన అక్కసు బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ పర్యటనపై అటు రష్యా కూడా సంతోషంగానే ఉంది. తాజాగా పుతిన్ ఆసక్తికర కామెంట్స్ చేసారు.

Also Read : ఏపీ స్థానిక సమరానికి ఎలక్షన్ కమిషన్ సిద్ధం..!

చైనాలోని టియాంజిన్‌లో ఇటీవల ముగిసిన 25వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో జరిగిన విషయాలను పుతిన్ పంచుకున్నారు. అమెరికాలో అలస్కాలో జరిగిన ట్రంప్ తో భేటీ గురించి మాట్లాడుతూ.. ఆ చర్చల గురించి మోడీతో తాను మాట్లాడానని, అక్కడ ఏం జరిగిందో వివరించాను అన్నారు. ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక సమావేశం కోసం రిట్జ్-కార్ల్టన్ హోటల్‌కు వెళుతున్నప్పుడు మోడీతో మాట్లాడినట్టు తెలిపారు.

Also Read: అసలు వస్తారా.. రారా.. ఏమైంది మీకు..?

కారులో జరిగిన ఈ ప్రయాణం వాస్తవానికి 15 నిమిషాలే అయినా దాదాపు గంట పాటు ఈ ఇద్దరూ ప్రయాణించారు. మోడీతో తాను ఇంగ్లీష్ లోనే మాట్లాడాను అన్నారు. అమెరికా అధ్యక్షుడితో తాను తక్కువ మాట్లాడాను అన్నారు. ఉక్రెయిన్ విషయంలో మోడీతో తాను మాట్లాడినట్టు తెలిపారు పుతిన్. అలాగే ఇద్దరి మధ్య ట్రంప్ సుంకాల గురించి కూడా చర్చ జరిగినట్టు వెల్లడించారు. కాగా ఈ భేటీ తర్వాత రష్యా చమురు ఎగుమతులపై భారీ తగ్గింపు ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్