Monday, October 20, 2025 10:01 PM
Monday, October 20, 2025 10:01 PM
roots

కవితకు అండగా సీనియర్లు.. కెటిఆర్ కు అడ్డు పడుతున్నారా..?

తెలంగాణా ప్రతిపక్ష పార్టీ భారత రాష్ట్ర సమితిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ అధిష్టానానికి గత మూడు నెలలుగా తలనొప్పిగా మారాయి. కల్వకుంట్ల కవిత వ్యవహారంలో ఏం చేయాలనే విషయంలో పార్టీ అధిష్టానం తలమునకలు పడుతోంది. ఏ విధంగా ప్రయత్నం చేసినా సరే కవిత, అసమ్మతి రాగం వీడటం లేదు. దీనితో ఆమెను పార్టీ నుంచి బయటకు పంపించే అవకాశం ఉందనే వార్తలు చూస్తూనే ఉన్నాం. తాజాగా కూడా తెలంగాణా బొగ్గు గని కార్మిక సంఘం విషయంలో సంచలన కామెంట్స్ చేసారు కవిత.

Also Read : ఆ విషయంలో టీడీపీకి వైసీపీ నేత మద్దతు..!

వాస్తవానికి కవితను గత నెలలోనే సస్పెండ్ చేస్తారని, ఆమె కొత్త పార్టీ పెడతారని భావించారు. కానీ కవిత మాత్రం కేసీఆర్ పై విమర్శలు చేయకపోవడంతో సైలెంట్ గా ఉంటూ వచ్చింది అధిష్టానం. కానీ కెటిఆర్ మాత్రం కొప్పుల ఈశ్వర్ కు కార్మిక సంఘం బాధ్యతలు అప్పగించి కవితకు ప్రాధాన్యత తగ్గించారు. ఇదే సమయంలో కేసీఆర్ పై కవితను సస్పెండ్ చేసే దిశగా కెటిఆర్ ఒత్తిడి చేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. కానీ సీనియర్లు అడ్డు పడుతున్నట్టు రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Also Read : పులివెందులలో టీడీపీ బిగ్ స్టెప్..?

కెటిఆర్ విషయంలో కొందరు సీనియర్ నేతలు వ్యతిరేకంగా ఉన్నారు. గతంలో ఆయన సిఎం కాకుండా అడ్డుకుంది కూడా వారే. ఇప్పుడు కూడా వారే కవితకు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నట్టు సమాచారం. హరీష్ రావు సహా కొందరు సీనియర్ నేతలు కవితను సస్పెండ్ చేయడానికి ఒప్పుకోవడం లేదట. దీని వెనుక బలమైన కారణం ఉందని టాక్. లిక్కర్ స్కాంలో పార్టీ నేతలు లాభపడ్డారు అనే వాదన ఉంది. కాని కవిత జైలుకు వెళ్లి వచ్చారు. అలాంటి వ్యక్తిని సస్పెండ్ చేస్తే పార్టీ క్యాడర్ లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని సీనియర్లు వాదిస్తున్నట్టు సమాచారం. ఆ తర్వాత కూడా సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తే పార్టీ ఇబ్బంది పడుతుంది. అందుకే సీనియర్ లు వద్దంటున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

కందుకూరులో వైసీపీ ప్లాన్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సామాజిక వర్గాల మధ్య...

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

పోల్స్