Monday, October 20, 2025 07:02 PM
Monday, October 20, 2025 07:02 PM
roots

ఇండో – అమెరికన్లకు బిగ్ షాక్.. వీసాల రివ్యూ స్టార్ట్..!

అమెరికాలో విదేశీయులకు చుక్కలు చూపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సర్కార్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో చెల్లుబాటు అయ్యే ఆ దేశ వీసాలను కలిగి ఉన్న 55 మిలియన్లకు పైగా విదేశీయుల రికార్డులను సమీక్షిస్తున్నట్లు విదేశాంగ శాఖ గురువారం సంచలన ప్రకటన చేసింది. తేడా వస్తే నిబంధనలు విధించడం లేదా బహిష్కరించే అవకాశం ఉందని ప్రకటించింది. అమెరికాలో ఉండే వారి వీసాలను నిరంతరం పరిశీలిస్తామని ట్రంప్ సర్కార్ ప్రకటించింది.

Also Read : ట్రంప్ కు బ్రిక్స్ దెబ్బ.. గట్టి దెబ్బ కొట్టనున్న భారత్ – రష్యా – చైనా..!

వారు అమెరికాలో ఉండటానికి అర్హులా కాదా..? వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటీ అనే అంశాలను పరిశీలిస్తామని.. అటువంటి సమాచారంలో ఏదైనా లోపాలు దొరికితే, వీసా రద్దు చేస్తామని.. వీసా హోల్డర్ యునైటెడ్ స్టేట్స్‌ లో ఉంటే, అతను లేదా ఆమె బహిష్కరణకు గురవుతారని వైట్ హౌస్ ప్రకటించింది. వీసా గడువు ముగిసిన తర్వాత స్టేలు, నేర కార్యకలాపాలు, ప్రజా భద్రతకు ముప్పు, ఏదైనా రకమైన ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొనడం లేదా ఉగ్రవాద సంస్థకు మద్దతు అందించడం వంటి అనర్హత సూచికల కోసం విచారణ చేస్తున్నామని తెలిపింది.

Also Read : తప్పుడు పనులు చేస్తే వదలను.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

జనవరిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుండి, ఆయన ప్రభుత్వం ఇప్పటివరకు అమెరికాలో అక్రమంగా వలస వచ్చినవారిని, విద్యార్థి మరియు టూరిస్ట్ వీసాలు ఉన్నవారిని బహిష్కరించడంపై దృష్టి పెట్టింది. స్టేట్ డిపార్ట్‌మెంట్ దీనిపై కొన్ని నిబంధనలను విధించేందుకు సమయం కూడా తీసుకుంది. రీ-వెట్టింగ్ ప్రక్రియ చాలా విస్తృతంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. వీసా దరఖాస్తుదారులందరూ స్వయంగా ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. నిబంధనతో సహా, వీసా దరఖాస్తుదారులపై ప్రభుత్వం క్రమంగా మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం కనపడుతోంది. భారత్ సహా ఆసియా దేశాలకు చెందిన వారి వీసాలు, అలాగే ముస్లిం దేశాల వీసాలను ఎక్కువగా రివ్యూ చేస్తోంది అమెరికా.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

కందుకూరులో వైసీపీ ప్లాన్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సామాజిక వర్గాల మధ్య...

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

పోల్స్