Monday, October 20, 2025 08:38 AM
Monday, October 20, 2025 08:38 AM
roots

ఇక నా వల్ల కాదు.. ఫ్రీ సర్వీస్ ప్లీజ్..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఐదేళ్ల పాటు ఏపీలో అధికారంలో ఉంది. మళ్లీ మళ్లీ మేమే గెలుస్తామని ధీమాగా కూడా చెప్పారు ఆ పార్టీ నేతలు. 30 ఏళ్ల పాటు మనదే అధికారం అని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గొప్పగా వెల్లడించారు కూడా. వై నాట్ కుప్పం, వై నాట్ పిఠాపురం, వై నాట్ మంగళగిరి.. వై నాట్ 175 అంటూ ఎన్నికల ముందు భారీ డైలాగులు చెప్పారు. సిద్ధం అంటూ సభలు నిర్వహించారు. సింహం సింగిల్.. అని పెద్ద పెద్ద మాటలు కూడా చెప్పారు. కానీ చివరికి పరిస్థితి మాత్రం మారిపోయింది. ఎన్నికల్లో పార్టీ ముఖ్య నేతలంతా మాజీలుగా మిగిలిపోయారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప.. మిగిలిన మంత్రులంతా ఓడిపోయారు. వాడెంత, వీడెంత అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పిన నేతలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. చివరికి అధినేతకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.

Also Read : ‘వార్ 2’ లో ఎన్టీఆర్ విలనిజం పండలేదా..?

ఇక మరో మూడేళ్లు కళ్లు మూసుకుంటే.. మనదే అధికారం.. ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా ఓటేస్తారు.. చంద్రబాబు మహా అయితే మరో మూడేళ్లు ఉంటాడేమో.. ఆ తర్వాత మనదే అధికారం.. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.. అనే మాటలు తరచూ చెబుతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మనదే అధికారం.. అప్పుడు ప్రతి ఒక్కరి లెక్కలు తేలుస్తా అంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. అలాగే ఈ మూడేళ్లు పార్టీ కోసం కష్టపడాలంటూ నేతలను సూచిస్తున్నారు కూడా.

Also Read : ఉపరాష్ట్రపతి ఏకగ్రీవం కోసం ఎన్డీఏ కష్టాలు

అయితే ఇక్కడే ఓ మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికల వరకు పార్టీ కార్యక్రమాల కోసం నేతలు ఖర్చు పెట్టాలని పార్టీ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది. ఎన్నికల వరకు పార్టీ సూచించిన కార్యక్రమాలను నియోజకవర్గాల్లో నిర్వహించే బాధ్యత ఇంఛార్జులదే అని.. ఇందుకోసం పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదని తేల్చేసినట్లు సమాచారం. కార్యకర్తల అవసరాలు కూడా ఆయా నేతలే దగ్గరుండి చూసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే నేతలు మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నారు. ఐదేళ్ల పాటు నియోజకవర్గాల్లో ఖర్చు చేసిన వారికి చివరి నిమిషంలో టికెట్ ఇవ్వకపోతే.. అప్పుడు ఖర్చు చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది కదా అనేది నేతల మాట. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు.

Also Read : ఆ ఇద్దరి కోసం పంత్ కెప్టెన్సీ వదులుకున్నాడా..?

ఇప్పుడు వైసీపీ కోసం ప్రతి ఒక్కరూ ఉచిత సేవ చేయాలని ముఖ్య నేతలు ఆదేశించడం ఆ పార్టీలో పెద్ద దుమారం రేపుతోంది. వైసీపీకి ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయం ఉంది. అందులో కొంతమంది సిబ్బంది కూడా పని చేస్తున్నారు. ఆఫీసులో పని చేసే మేనేజర్లు జిల్లా వ్యాప్తంగా పార్టీ సమాచారాన్ని తాడేపల్లికి చేరవేయడం.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలను జిల్లాలోని కింది స్థాయి కార్యకర్త వరకు చేరవేయడం వారి బాధ్యత. పార్టీ కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయా లేదా.. అనేది కూడా మేనేజర్లే పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం వీళ్లకు వైసీపీ ప్రతి నెలా జీతం కూడా ఇస్తుంది. ఇలా 26 జిల్లాలోని పార్టీ కార్యాలయాల నిర్వహణ, వేతనాల కోసం ప్రతి నెలా 12 నుంచి 15 లక్షల రూపాయల వరకు వైసీపీ ఖర్చు చేస్తుంది.

Also Read : జీఎస్టీ తగ్గుతోంది.. మిడిల్ క్లాస్ కు పండుగే.. తగ్గే ధరలు ఇవే..!

రెండు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ మేనేజర్లను తాడేపల్లి ప్యాలెస్‌కు పిలిపించారు. వీరితో పార్టీ నేత ఆలూరు సాంబశివారెడ్డి భేటీ అయ్యారు. ముందుగా జిల్లాల్లో పార్టీ పరిస్థితులు, ఆదాయ వ్యయాల గురించి వివరాలు సేకరించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మేనేజర్లతో ముచ్చటించారు. భోజన విరామం తర్వాత చావు కబురు చల్లగా చెప్పారు. ప్రస్తుతం పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉందని.. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతోందని సాంబశివారెడ్డి తెలిపారు. ఇకపై జీతాలు ఇచ్చే పరిస్థితిలో పార్టీ లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. వైసీపీ పైన, జగన్ పైన మీకు ప్రేమ ఉంటే.. పార్టీకి ఉచితంగా సేవ చేయాలని సూచించారు. అలా చేసిన వారికి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ నమ్మకం లేకపోతే.. ఇప్పుడే మీ దారి మీరు చూసుకోవచ్చు అంటూ తేల్చేసినట్లు తెలుస్తోంది.

Also Read : విమర్శలకు నో ఛాన్స్.. సంక్షేమంలో చంద్రబాబు పక్కా ప్లానింగ్

వైసీపీ పెద్దల మాటలతో ఆ పార్టీ కిందిస్థాయి నేతలు, కార్యకర్తలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో లెక్క లేనంత అవినీతి జరిగిందనేది ప్రధాన ఆరోపణ. మద్యం, ఇసుక, మైనింగ్ మాఫియాలతో ఇష్టం వచ్చినట్లు దోపిడీ చేశారనేది బహిరంగ రహస్యం. పార్టీ ఓడిన తర్వాత ఇలా బీద పలుకులు ఏమిటని నిలదీస్తున్నారు కూడా. దోచుకున్న సొమ్ములో కనీసం ఒక్క శాతం కూడా పార్టీ కోసం ఖర్చు చేయలేరా అని ప్రశ్నిస్తున్నారు. కనీసం ఖర్చు చేయకుండా.. మళ్లీ అధికారంలోకి వస్తామని ఎలా చెబుతున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్