దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ విషయంలో మీడియా చూపించే విషయాలు కాస్త ఆశ్చర్యకరంగా ఉంటాయి. గతాన్ని మర్చిపోయి మీడియా ప్రవర్తించే విధానం చాలా వింతగా ఉంటుంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా వ్యవహరించే కొన్ని మీడియా సంస్థలు గతాన్ని ఎక్కువగా మర్చిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఓ వర్గం మీడియా.. అనుసరిస్తున్న వైఖరి విస్మయానికి గురి చేస్తోంది
Also Read : ఏపీ ఫ్యూచర్ సీఎంపై క్లారిటీ..!
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం నామినేషన్ లు కూడా దాఖలు చేయకుండా అడ్డుకున్న విషయాలను మర్చి.. ఇప్పుడు టీడీపీ, కూటమి ప్రభుత్వాన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణా రాజధాని కేంద్రంగా పని చేసే ఓ ప్రముఖ మీడియా ఏకంగా రిగ్గింగ్ జరుగుతుందని, టీడీపీ గూండాలు అంటూ కథనాలు ప్రసారం చేయడం గమనార్హం. పులివెందులలో అక్రమ ఓట్లు వేస్తున్నారని, దానికి పోలీసులు సహకరిస్తున్నారని చెప్పడం మరింత ఆశ్చర్యం కలిగించేది.
Also Read : వివేకా కేసుపై అవినాష్ కామెంట్స్.. టీడీపీ ఎమ్మెల్యే సెన్సేషనల్ పోస్ట్
గత స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సైలెంట్ గా ఉన్న ఇదే మీడియా.. కనీసం నామినేషన్ లు వేయకుండా అడ్డుకున్నారు అనే విషయాన్ని కనీసం ప్రస్తావించలేదు. పుంగనూరు, పులివెందుల, నందికోట్కూరు సహా చాలా నియోజకవర్గాల్లో అక్రమాలు జరిగినా మాట్లాడలేదు. తమ ప్రాణాలు తీస్తున్నారని టీడీపీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం అన్యాయాలు, అక్రమాలు అంటూ కథనాలు వేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనిపై టీడీపీ సోషల్ మీడియా అదే స్థాయిలో ఆన్సర్ ఇచ్చ్చే ప్రయత్నం చేస్తోంది. బ్లూ మీడియాను బ్యాన్ చేయలాని డిమాండ్ చేస్తోంది. అంజిరెడ్డి వంటి కార్యకర్తల ఆవేదన అప్పట్లో చూపిస్తే బాగుండేది అంటూ చరిత్రలో జరిగిన నిజమైన ఘటనలు ఆ మీడియా ముందు ఉంచుతోంది.