Tuesday, October 28, 2025 02:14 AM
Tuesday, October 28, 2025 02:14 AM
roots

లిక్కర్ లో ఇరుక్కున్న మరో ఐపిఎస్.. చార్జ్ షీట్ లో సంచలనాలు

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఎప్పుడు, ఏ పేరు బయటకు వస్తుందో అర్ధం కాక అటు అధికార, ఇటు రాజకీయ వర్గాల్లో ఆందోళన నెలకొంది. లిక్కర్ కుంభకోణానికి ఎక్కువగా రాజకీయ నాయకులే సూత్రధారులు అనే విషయంలో స్పష్టత ఉన్నా సరే ఇప్పటి వరకు కొన్ని కీలక అరెస్ట్ ల విషయంలో వెనకడుగు వేసారు అనేది మాత్రం వాస్తవం. కేవలం ఇద్దరు రాజకీయ నాయకులను మాత్రమె అదుపులోకి తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

Also Read : కూలీ టికెట్ ధర తెలిస్తే మైండ్ బ్లాక్…!

ఇక ఈ వ్యవహారంలో ఎప్పటికప్పుడు సంచలన పేర్లు బయటకు వస్తున్నాయి. తాజాగా ఓ ఐపిఎస్ పేరు బయటకు వచ్చింది. లిక్కర్‌ కేసు అడిషనల్‌ ఛార్జ్‌షీట్‌లో కీలక అంశాలు ప్రస్తావించారు అధికారులు. 124 పేజీలతో అడిషనల్‌ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది సిట్. నిందితుల చాట్‌ లిస్ట్‌, ఎస్ఎంఎస్, గూగుల్‌ టేక్‌ అవుట్‌ బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను సిట్ జత చేసింది. ఛార్జ్‌ షీట్‌లో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు పేరు ప్రస్తావించింది. లిక్కర్‌కి సంబంధించిన ఫైల్స్ ధ్వంసం అయ్యాయని ప్రస్తావించింది.

Also Read : యుద్ధం ఆపుతా.. ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్

ధ్వంస రచన వెనుక పీఎస్‌ఆర్ ఆంజనేయులు పాత్ర ఉందన్ని అధికారులు గుర్తించారు. నిందితులకు ఆంజనేయులు నుంచి కాల్స్‌ వెళ్లాయని విచారణలో వెల్లడి అయింది. లిక్కర్ డబ్బులతో నిందితులు భారీగా ఆస్తులు కొన్నారని, రాజ్‌ కేసిరెడ్డి 11 చోట్ల 30.52 ఎకరాలు కొన్నారని తేల్చారు. హైదరాబాద్‌, నెల్లూరులో ధనుంజయ్‌ భూములు కొన్నారని చార్జ్ షీట్ లో ప్రస్తావించారు. లిక్కర్‌ డబ్బుల కోసం షెల్‌ కంపెనీలు పెట్టించారని వెల్లడి అయింది. లిక్కర్‌ పాలసీ అమలు కోసం ఐఏఎస్ రజత్‌ భార్గవపై,వాసుదేవరెడ్డి, కృష్ణమోహన్‌ ఒత్తిడి తెచ్చారని, అక్రమాలపై చర్యలు తీసుకోకుండా ఒత్తిడి చేశారని సిట్ వెల్లడించింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్