దశాబ్దాలుగా అమెరికా, రష్యా దేశాల మధ్య యుద్ద వాతావరణమే ఉంటుంది. ఆధిపత్యం కోసం అప్పట్లో నాటో, సోవియట్ యూనియన్ ఎన్నో చిత్రాలకు తెర తీసేవి. ఇప్పుడు రెండు దేశాలుగా తమ ఆధిపత్యం కోసం తీవ్ర పోరాటం చేస్తున్నాయి. ఈ తరుణంలో రెండు దేశాల అధ్యక్షుల మధ్య కీలక సమావేశం జరగనుంది. వచ్చే వారం అలాస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం కానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : కూలీ టికెట్ ధర తెలిస్తే మైండ్ బ్లాక్…!
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందని, కాబట్టి అమెరికా విధించిన సుంకాలు రష్యా ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్.. రష్యా.. చమురు దిగుమతిదారులలో పెద్ద దేశమని, తమ సుంకాలతో భారత్ వెనక్కు తగ్గడం ఖాయమని ట్రంప్ పేర్కొన్నారు. వైట్ హౌస్ విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. రష్యా ఆర్థిక వ్యవస్థ ఏ మాత్రం బాగాలేదన్నారు. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలతో రష్యా ఇబ్బంది పడుతోందన్నారు.
Also Read : ఏపీ ఫ్యూచర్ సీఎంపై క్లారిటీ..!
రష్యాలో చాలా అవకాశాలు ఉన్నాయని, కాని రష్యా ఇప్పుడు అనుకున్న స్థాయిలో లేదన్నారు. రష్యా అధ్యక్షుడు మన దేశానికి రావడం చాలా గౌరవప్రదంగా ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా అక్కడికి వెళ్ళడం కంటే వాళ్ళు ఇక్కడికి రావడమే బాగుందన్నారు. పుతిన్ నిర్మాణాత్మక చర్చలు జరుపుతారని తాను ఆశిస్తున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. ఈ సమావేశం తర్వాత యూరప్ దేశాల అధినేతలతో చర్చలు జరిపి.. ఉక్రెయిన్, రష్యా యుద్దాన్ని ఆపాలి అనుకుంటున్నా అంటూ ట్రంప్ కామెంట్ చేసారు.