Friday, September 12, 2025 02:54 PM
Friday, September 12, 2025 02:54 PM
roots

మళ్ళీ మొదలైన నందమూరి ఫ్యాన్ “వార్”..!

మనకు ఒకడు నచ్చకపోతే వాడిలో ఎన్నో లోపాలు వెతుకుతూ తిట్టే పనిలో ఉంటాం. ఈ విషయంలో వినోద రంగాన్ని అభిమానించే అభిమానులు ముందు వరుసలో ఉంటారు. నచ్చని హీరోలను నానా కూతలు కూస్తూ ఉంటారు. ఆ తిట్లు నచ్చని మరో హీరో అభిమానులు.. చిన్నపాటి యుద్దానికి తెర తీస్తారు. ఇది సోషల్ మీడియా వచ్చిన తర్వాత పీక్స్ కు వెళ్ళింది అనే చెప్పాలి. మొన్నటి వరకు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ వార్ చూసిన జనాలు.. ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ వార్ చూస్తున్నారు.

Also Read : లక్షల టన్నుల బంగారం.. ఇండియాలో భారీగా నిక్షేపాలు

దీనికి కారణం వార్ 2 ఈవెంట్ లో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్. ఎన్టీఆర్.. మాట్లాడుతూ ఎవరు ఆపినా ఆగను అంటూ కాస్త కాలర్ ఎగరేయడం, తనకు ఎవరి సపోర్ట్ లేనప్పుడు రామోజీ రావు, ఫ్యాన్స్ సపోర్ట్ చేసారు అనడం బాలకృష్ణ ఫ్యాన్స్ కు మండింది. ఇక ఫ్యాన్స్ విషయంలో కూల్ గా ఉండే ఎన్టీఆర్.. ఈసారి మాత్రం కాస్త రివర్స్ లో కనిపించాడు. చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఆ కామెంట్స్ తర్వాతి నుంచి సోషల్ మీడియాలో విమర్శలు వేరే లెవెల్ కు వెళ్ళాయి.

ఎన్టీఆర్ లిమిట్స్ లో మాట్లాడాలని బాలయ్య ఫ్యాన్స్.. లిమిట్స్ ఎన్టీఆర్ కే వర్తిస్తాయా అని అతని ఫ్యాన్స్ రివర్స్ కౌంటర్ లు ఇచ్చారు. నందమూరి కుటుంబం సపోర్ట్ లేకుండానే ఇక్కడి వరకు వచ్చాడా.. ఇష్టమైన బాబాయ్ అంటూ బాలయ్య గురించి గతంలో ఎందుకు మాట్లాడాడు, అంత సపోర్ట్ చేయనప్పుడు టీడీపీకి ఎందుకు ప్రచారం చేసాడు.. అంటూ బాలయ్య ఫ్యాన్స్.. సొంతగా కాళ్ళ మీద పైకి వచ్చాడు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా ఒకరికి ఒకరు కౌంటర్ లు ఇచ్చుకోవడం కంటిన్యూ అవుతోంది.

Also Read : వార్ 2 పై కూలీ డామినేషన్ లెక్కలు ఇవే.. ఈ రేంజ్ లోనా..?

దేవర సినిమా టైం లో ఎన్టీఆర్ ను మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తే.. ఎన్టీఆర్ కు సపోర్ట్ చేసింది బాలయ్య ఫ్యాన్స్ మాత్రమె అనే విషయాన్ని ఎన్టీఆర్, అతని ఫ్యాన్స్ ఎలా మర్చిపోతారు అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. వార్ 2 హిట్ కాక ముందే కాలర్ ఎగరేయడం సిల్లీగా ఉందని బాలయ్య ఫ్యాన్స్ అంటే.. కష్టపడిన వాడికి రిజల్ట్ తెలుసు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిప్లై ఇస్తున్నారు. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో గాని వార్ 2 రిలీజ్ కాకుండానే వార్ మొదలైపోయింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్