రాజకీయాల్లో ఈ మధ్య అరెస్ట్ లు సహజంగా మారాయి. తప్పు చేసిన వారిని చేయని వారిని కూడా అరెస్ట్ చేయడం సాధారణంగా మారిన అంశం. వైసీపీ హయాంలో టీడీపీ నేతలను టార్గెట్ చేసి రాజకీయం చేసింది వైసీపీ. తమను విమర్శించే వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టింది. దీనితో టీడీపీ న్యాయ విభాగం ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పుడు టీడీపీ వంతు వచ్చింది. టీడీపీ ప్రభుత్వంలో ఆధారాలతో సహా వైసీపీ నేతలను అరెస్ట్ లు చేస్తున్నారు. కీలక స్కాం లు బయటపడుతున్నాయి.
Also Read : ఏమయ్యారు వాళ్లంతా.. ప్రజలు మర్చిపోయారా..?
ఈ సమయంలో వైసీపీ న్యాయ విభాగం అత్యంత బలహీనంగా కనపడటం ఆ పార్టీని ఆందోళనకు గురి చేస్తోంది. ఎవరిని అరెస్ట్ చేసినా పొన్నవోలు సుధాకర్ రెడ్డి బెయిల్ కోసం కష్టపడుతున్నారు. కానీ బలమైన వాదనలు వినిపించకపోవడంతో, బెయిల్ రావడం కష్టం అవుతోంది. చాలా మంది నాయకులకు ఆయన వాదించగా దాదాపు అందరికీ 14 రోజుల రిమాండ్ విధించారు. ఇలా జైలుకు వెళ్ళిన వారు ఇంకా జైల్లోనే ఉంటున్నారు. కొందరు సొంత లాయర్లను పెట్టుకుని ఏదోకరకంగా బయటకు వస్తున్నాయి.
Also Read : బీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పదా..?
వాదనల్లో బలం లేకపోవడం, నియంత మాదిరిగా వ్యవహరించడంతో పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనితో తాజాగా పార్టీ న్యాయ విభాగం సమావేశంలో పొన్నవోలుపై లాయర్లు సీరియస్ అయ్యారు. తప్పుకోవాలని, మీ సేవలు ఇక చాలని గొడవ చేసారు. జగన్ ముందే ఇదంతా జరిగింది కూడా. అటు పార్టీ నేతలు కూడా పొన్నవోలు వద్దని కోరినట్టు తెలుస్తోంది. అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్న నాయకులు దాదాపుగా పొన్నవోలు వద్దని, ముందే లాయర్లను కూడా మాట్లాడుకుని పెట్టుకున్నట్టు టాక్.