అమెరికా అధ్యక్షుడిగా రెండవ సారి బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్.. ప్రపంచ దేశాల విషయంలో నిత్యం ఏదోక వివాదాస్పద వైఖరి, నిర్ణయాలతో అలజడి సృష్టిస్తున్నారు. తాజాగా ప్రపంచ దేశాలకు సుంకాలను ప్రకటించారు ట్రంప్. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. భారత్ పై 25 శాతం సుంకాలు విధించారు ట్రంప్. ఇదే సమయంలో పాకిస్తాన్ కు కేవలం 19 శాతం విధించారు. అలాగే ఆ దేశంతో కీలక ఒప్పందం కూడా చేసుకున్నారు ట్రంప్. ఆయిల్ నిల్వలను పాకిస్తాన్ లో వెలికితీసే ఒప్పందం చేసుకున్నారు.
Also Read : ప్రజ్వల్ రేవన్నకు కోర్ట్ బిగ్ షాక్.. పొలిటికల్ కెరీర్ ఖతం..!
దీనితో అసలు పాకిస్తాన్ లో ఆయిల్ నిల్వలు ఉన్నాయా అనే ప్రశ్న ఒకటి వినపడుతోంది. దీనిపై జాతీయ మీడియా తాజాగా లెక్కలు బయటపెట్టింది. వాస్తవానికి పాకిస్తాన్ తో పోలిస్తే భారత్ లో చమురు నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 2016 నాటికి ఇది దాదాపు 4.8 బిలియన్ బ్యారెళ్ల నిల్వలు ఉన్నాయి. అలాగే భారత్.. సముద్రాల నుంచి ముడి చమురును వెలికి తీస్తోంది. రిలయన్స్ సహా పలు సంస్థలు దూకుడుగా ఉన్నాయి. ఆ ఆయిల్ ను శుద్ధి చేసే సామర్ధ్యం కూడా ఉంది.
Also Read : టీంలో ఆ ఒక్కడికే ఎందుకీ ఈ అన్యాయం..?
కాని పాకిస్తాన్ కు ఈ సదుపాయాలు, సాంకేతికత లేవు. భారత్ పాకిస్తాన్ తో పోలిస్తే.. రోజు వారీగా భారీగా ముడి చమురు ఉత్పత్తి చేస్తోంది. ఉదాహరణకు, ఫిబ్రవరి 2025 లో, భారత్ రోజుకు 6,00,000 బ్యారెళ్లకు పైగా ఉత్పత్తి చేసింది. కాని పాకిస్తాన్ 68,000 బ్యారేల్స్ మాత్రమే ఉత్పత్తి చేయడం గమనార్హం. ఈ రెండు దేశాలు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. పాకిస్తాన్ తో పోలిస్తే ఇండియన్ మార్కెట్ ఎక్కువ కాబట్టి.. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. భారత్ కు పాకిస్తాన్ కూడా ఎగుమతి చేసే రోజులు వస్తాయంటూ ట్రంప్ మరో కామెంట్ చేసారు.
పాకిస్తాన్ లో ఉత్పత్తి అయ్యే ఆయిల్ నిల్వలు ఆ దేశానికే సరిపోయే పరిస్థితి లేదు. పాకిస్తాన్ తమ ఆయిల్ నిల్వలపై పలు పరిక్షలు కూడా చేసింది. ఎక్కడా ఆయిల్ జాడ లేదు. ఇరాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లోనిల్వలు ఉన్నా సరే భద్రతా కారణాలతో పాకిస్తాన్ ముందుకు అడుగు వేయలేకపోతోంది. ఖచ్చితంగా పాకిస్తాన్ తో చేసుకున్న ఒప్పందానికి ప్రధాన కారణం.. రష్యా నుండి ఆయిల్ కొనుగోలు ఆపేసి, అమెరికా నుంచి కొనుగోలు చేసే ఉద్దేశమే. అలాగే పాకిస్తాన్ లో చమురు ఉత్పత్తి చేసే సామర్ధ్యం తక్కువ. కొన్ని చోట్ల ఆయిల్ నిల్వలు ఉన్నా సరే వాటిని ఉత్పత్తి చేయలేని పరిస్థితి. ఆయిల్ ఉత్పత్తి చేసే ఉద్దేశంతోనే పాకిస్తాన్ తో ఒప్పందం చేసుకుని ఉండవచ్చు అనే అభిప్రాయాలు కూడా వినపడుతున్నాయి.