Friday, September 12, 2025 06:30 PM
Friday, September 12, 2025 06:30 PM
roots

యాత్ర అయితేనే రెడీ.. లేదంటే లేదంతే..!

యాత్ర ఉందా.. జనం వస్తారా.. కార్యకర్తలు రావడానికి అవకాశం ఉందా.. లేదా.. అయితే తర్వాత చూద్దాం లే.. ఇవే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ ముఖ్య నేతలతో చెప్పిన మాటలు. ఇవి విన్న వాళ్లు.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదేంటి.. ఇలా అంటారు.. మన పార్టీ నేతలను పరామర్శించేందుకు కూడా చుట్టూ జనం ఉండాలా.. అనేది వైసీపీ నేతల మాట. ఎన్నికల్లో వైసీపీ ఓడిన తర్వాత ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కేవలం పరామర్శలు మాత్రమే చేశారనేది వాస్తవం. అటు పల్నాడు జిల్లా మొదలు.. నెల్లూరు జిల్లా వరకు జగన్ కేవలం పరామర్శల పర్యటనలు మాత్రమే చేశారు. ఇందులో వల్లభనేని వంశీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం జైలుకు కూడా వెళ్లారు జగన్. ఈ ఇద్దరినీ పరామర్శించినప్పుడు తప్ప.. మిగిలిన అన్ని సందర్భాల్లో చుట్టూ మందీ మార్భలం ఉండాల్సిందే అన్నట్లుగా జగన్ పర్యటన సాగిందనేది వాస్తవం.

Also Read : టార్గెట్ కమ్మ సామాజిక వర్గం.. సోషల్ మీడియాలో కొత్త వ్యూహం..?

నెల్లూరు, సత్తెనపల్లి, బంగారుపాళ్యం, పొదిలి, గుంటూరు, వినుకొండ, తెనాలి.. ఇలా ఊరు ఏదైనా సరే.. పర్యటన పేరుతో తన బలం ఇంకా తగ్గలేదు అని చూపించేందుకే జగన్ ఎక్కువ ఆసక్తి చూపారనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట. పరామర్శ పేరుతో బల ప్రదర్శనలు చేశారనేది టీడీపీ నేతల ఆరోపణ. ప్రజల్లో తనకు ఇంకా ఆదరణ తగ్గలేదని.. ఎన్నికల్లో ఓటమికి ఈవీఎం కారణమని చెప్పడమే జగన్ ఏకైక లక్ష్యం. అందుకే ప్రతి పర్యటనలో పోలీసు ఆంక్షలను బేఖాతరు చేసి మరీ యాత్రలు చేస్తున్నారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు పరదాల మాటున పర్యటించిన జగన్.. ఇప్పుడు మాత్రం.. తన వాహనం డోర్ దగ్గర నిల్చుని.. అందరినీ దగ్గరకు పిలుస్తున్నారు. షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వరద బాధితులను కూడా సెట్టింగ్ వేసి పరామర్శించిన జగన్.. ఇప్పుడు మాత్రం.. మళ్లీ ముద్దులు పెడుతూ.. దగ్గరకు తీసుకుంటున్నారు. ఓదారుస్తున్నారు.

Also Read : జగన్ కోసం షార్ప్ షూటర్స్ కామెంట్.. మాయమైపోయిన జర్నలిస్ట్

జైలులో ఉన్న వల్లభనేని వంశీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డిలను జగన్ ములాఖత్ అయ్యారు. ఆ తర్వాత బయటకు వచ్చి పోలీసుల బట్టలూడదీస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. పిన్నెల్లి, కాకాణి కోసం నెల్లూరు వరకు వెళ్లిన జగన్.. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డి గురించి మాత్రం పట్టించుకోవటం లేదు. తాడేపల్లి నుంచి విజయవాడ జిల్లా జైలు సరిగ్గా పది కిలోమీటర్లు మాత్రమే. బెంగళూరు నుంచి తాడేపల్లి వెళ్తున్నప్పుడో.. లేక తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్తున్నప్పుడైనా ఓ సారి చెవిరెడ్డిని కలవొచ్చు. ఏం జరిగిందనే వివరాలు సేకరించవచ్చు. కానీ జగన్ మాత్రం అలా చేయలేదు. కానీ ఇదే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన మిథున్ రెడ్డి కోసం రాజమండ్రి వరకు వెళ్తున్నారు జగన్. దీనికి ప్రధాన కారణం.. విజయవాడ జిల్లా జైలు దగ్గరికి వైసీపీ కార్యకర్తలు వచ్చే అవకాశం చాలా తక్కువ. వచ్చినా కూడా.. ఓ వెయ్యి మంది వరకు మాత్రమే అలా వచ్చి.. ఇలా వెళ్లిపోతారు. అదే రాజమండ్రిలో అయితే… ప్రత్యేక వాహనాల ద్వారా ఇతర నియోజకవర్గాల నుంచి జనాల్ని పెద్ద తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. మధురపూడి ఎయిర్ పోర్టు నుంచి సెంట్రల్ జైలు వరకు ర్యాలీగా వెళ్లొచ్చనేది జగన్ ఆలోచన. అప్పుడు ఎక్కువ మంది జగన్‌ను చూసేందుకు వచ్చారని వైసీపీ నేతలు చెప్పుకునే అవకాశం ఉంది. అందుకే విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న చెవిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి గురించి జగన్ ఏ మాత్రం పట్టించుకోవటం లేదనేది వైసీపీలో వినిపిస్తున్న మాట.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్