Thursday, February 5, 2026 01:32 AM
Thursday, February 5, 2026 01:32 AM

అమెరికాపై రివెంజ్ ఉండదు.. కేంద్రం ప్రకటన..?

భారత్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. తాజాగా భారత్ దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీనితో భారత్ కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు పెంచి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. అదే జరిగితే భారత్ లో అమెరికా దిగుమతులపై ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ తరుణంలో జాతీయ మీడియా నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఈ సుంకాలపై భారత్ ప్రతీకారం తీర్చుకోదని, ఈ విషయాన్ని చర్చల పట్టికలో చర్చించి, ఇరు పార్టీలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందని కేంద్రం చెప్పినట్టు జాతీయ మీడియా పేర్కొంది.

Also Read : లిక్కర్ స్కాం లో సెన్సేషన్..? బిగ్ బాస్ కు నోటీసులు

ఆగస్టు 1 నుంచి భారత దిగుమతులపై అదనపు జరిమానాలతో పాటు 25% సుంకాన్ని విధిస్తున్నట్లు ట్రంప్ బుధవారం ప్రకటించారు. రష్యా నుండి భారత్ చమురు దిగుమతులను కొనసాగించడం, దీర్ఘకాలంగా ఉన్న వాణిజ్య అడ్డంకులు దీనికి కారణంగా భావిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసాయి. భారత్ ది డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ కామెంట్స్ చేసారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది.

Also Read : ఐపీఎస్ సంజయ్‌కి సుప్రీంకోర్టులో భారీ షాక్

భారత ఆర్ధిక వ్యవస్థ గురించి ట్రంప్ చెప్పాల్సిన అవసరం లేదు అంటూ కాంగ్రెస్ ఎంపీ శశి తరూర్ కామెంట్ చేసారు. రాజ్యసభ ఎంపీ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ ట్రంప్ ప్రకటనను తప్పుబట్టారు. ఎవరైనా మనల్ని ఆర్ధికంగా చేయాలి అనుకుంటే అది వారి భ్రమ అంటూ ఎద్దేవా చేసారు. ట్రంప్ ఎవరితో అయినా వ్యాపారం చేసుకోవచ్చని, భారత్ కు సంబంధం లేని విషయం అన్నారు. ప్రముఖ ప్రతిపక్ష నాయకురాలు ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని టాప్ ఐదు దేశాలలో ఉందని తెలుసుకోవడానికి తగినంత డేటా అందుబాటులో ఉందన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్