Friday, September 12, 2025 03:02 PM
Friday, September 12, 2025 03:02 PM
roots

నన్ను కెలకొద్దు కెటిఆర్.. సంచలన విషయాలు బయటపెట్టిన సిఎం రమేష్

తెలంగాణాలో కాంట్రాక్ట్ లు ఆంధ్రా వాళ్లకు ఇవ్వడం తగునా అంటూ తెలంగాణా మాజీ మంత్రి కెటిఆర్ చేసిన విమర్శలపై అనకాపల్లి ఎంపీ సిఎం రమేష్ ఘాటుగా స్పందించారు. కెటిఆర్ తనను కలిసిన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు, చేసిన కామెంట్స్ గురించి సిఎం రమేష్ మీడియా సమావేశంలో బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో బిజెపి, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని కెటిఆర్ భయపడుతున్నాడని ఎద్దేవా చేసారు సిఎం రమేష్. నాలుగు నెలల క్రితం ఢిల్లీలో నా ఇంటికి వచ్చిన నీవు మాట్లాడవో గుర్తుందా అంటూ కెటిఆర్ ను ప్రశ్నించారు సిఎం రమేష్.

Also Read : సింగపూర్ లో చంద్రబాబు.. టార్గెట్ ఇదే

మీ ప్రభుత్వంలో చేసిన అవినీతి బయటకు రాకుండా, కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే బిజెపిలో మీ పార్టీని కలపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పావు అవునా? కాదా? అని నిలదీశారు. నేను మా పార్టీ పెద్దలతో చర్చించి మీది అవినీతి పార్టీ అని, తెలంగాణలో మీ పని అయిపోయిందని కావున మీతో మాకు పని లేదని చెప్పడం వల్లే ఇటువంటి ఆరోపణ చేస్తున్నావని సంచలన కామెంట్స్ చేసారు.

Also Read : ఎవరి మీద నమ్మకం లేదంటున్న వైసీపీ..!

తుమ్మల నాగేశ్వరావు లాంటి నాయకుడిని మీ పార్టీ ఎందుకు వదిలేసుకుందని నిన్ను అడిగితే మా పార్టీకి కమ్మ నా కొడుకులు అవసరం లేదని. రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత మా పార్టీలో రెడ్డిలు కూడా రేవంత్ వెనకాల వెళ్లిపోయారని, ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్ రెడ్డితోనే కలిసి ప్రయాణం చేస్తున్నామని నువ్వు నాతో చెప్పావా లేదా? అని నిలదీశారు దమ్ముంటే రండి మీరు చెప్పిన చేయటకు వచ్చి మీడియా సమక్షంలో చర్చిద్దామని సవాల్ చేసారు సిఎం రమేష్. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అనవసరంగా నన్ను కెలికితే ఇంకా మీ గురించి చాలా నిజాలు చెప్పాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్