Friday, September 12, 2025 05:07 PM
Friday, September 12, 2025 05:07 PM
roots

2 వారాలుగా జగన్ ఫుల్ బిజీ.. ఏం జరుగుతోంది..?

2024 ఎన్నికల ఫలితాలు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ‌మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా చేశాయనేది వాస్తవం. అధికారం కోసం అమ్మా, అయ్యా అంటూ ముద్దులు కురిపించారు. ఒక్కఛాన్స్ అంటూ ఓట్లు అడిగారు. అలాగే ప్రశాంత్ కిషోర్‌ ఐ ప్యాక్ టీమ్‌తో ఒప్పందం చేసుకున్నారు. వారుచెప్పినట్లు చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్ తీరు పూర్తిగా మారిపోయింది. కనీసం సొంత పార్టీ నేతను కూడా దగ్గరకు రానివ్వలేదు. అమ్మ, చెల్లితో కూడా ఆస్తి వివాదాలు. సొంత వారిని దూరం చేసుకున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో ఒక నియంత మాదిరిగా ఐదేళ్ల ఏలుబడి సాగిందనేది వాస్తవం. ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టినా.. కనీసం నోరెత్తే ధైర్యం చేయలేదు. అయితే ఎన్నికల్లో తనదే గెలుపని.. మరో 30 ఏళ్లు తానే రాజకీయాల్లో ఉంటానన్నారు. అలాగే అసలు ప్రతిపక్షమే అవసరం లేదని.. వై నాట్ 175 అని గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాతే తత్వం బోధపడింది.

Also Read : ఆ విషయంలో వైసీపీ ఫుల్ కంట్రోల్..!

వై నాట్ 175 అని చెప్పిన జగన్‌కు.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కేవలం 11 స్థానాలకే వైసీపీ పరిమితమైంది. ఆ తర్వాత కనీసం అసెంబ్లీకి కూడా రావటం లేదు. ఓటమి తర్వాత తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ఎలహంక ప్యాలెస్‌కు మకాం మార్చేశారు. తొలి రోజుల్లో ఏదో అప్పుడప్పుడు వస్తున్న జగన్.. అధినేత కనిపించటం లేదని సొంత పార్టీ నేతలే విమర్శలు చేయడంతో.. వారంలో రెండు రోజులు తాడేపల్లిలో ఉండేలా ప్లాన్ చేశారు. అయితే రెండు వారాలుగా జగన్ తాడేపల్లి ప్యాలెస్‌వైపు రాలేదు. ప్రతి వారం వచ్చే జగన్.. రెండు వారాలుగా తాడేపల్లికి రావడం లేదు. ఇంకా చెప్పాలంటే.. అసలు ఏపీలోనే పర్యటించలేదు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మామిడి రైతులను పరామర్శించిన తర్వాత.. తాడేపల్లి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన జగన్.. ఆ తర్వాత నుంచి కనిపించటం లేదు. ఓ వైపు లిక్కర్ కేసు విచారణలో అరెస్టులు జరుగుతున్నాయి. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు అవుతారని సొంత పార్టీ నేతలే ఊహించలేదు. మిథున్ అరెస్ట్ తర్వాత జగన్ అరెస్టు ఖాయమనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇప్పుడు జగన్ ఏపీలో కనిపించకపోవడానికి.. రెండు వారాలుగా తాడేపల్లి ప్యాలెస్ వైపు రాకపోవడం చూస్తుంటే.. జగన్‌కు అరెస్టు భయం పట్టుకుందనే మాట వినిపిస్తోంది.

Also Read : కర్నూలులో ఇండియన్ ఆర్మీ సంచలన ప్రయోగం..!

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన రాజ్ కేసిరెడ్డి మొదలు.. జవహర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వరకు అంతా జగన్ సన్నిహితులే. ఇక ఈ కేసులో విజయ సాయిరెడ్డి తనను సాక్షిగా పరిగణించాలని సిట్ అధికారులను కోరారు. తాజాగా రిటైర్ట్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ కూడా తాను సాక్షిగా మారేందుకు అనుమతించాలని సిట్ అధికారులను కోరినట్లు తెలుస్తోంది. లిక్కర్ కేసులో అంతిమ లబ్దిదారుడు జగన్ మోహన్ రెడ్డి అని రజత్ భార్గవ తేల్చిచెప్పారనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో పెద్ద దుమారం రేపుతోంది. ఇక రెండు రోజుల క్రితం కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా మీడియా చిట్ చాట్‌లో జగన్ అరెస్టుపై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాలు అన్ని తెలుసుకున్న జగన్.. తాడేపల్లి వైపు వచ్చేందుకు కూడా సిద్ధంగా లేరనే మాట వినిపిస్తోంది.

Also Read : రోగులు ఏటీఎంలు కాదు.. హైకోర్ట్ సంచలన కామెంట్స్

లేని మద్యం కేసులో తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్నారని మీడియా ముందు ఆరోపిస్తున్న జగన్.. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత కనిపించటం లేదు. వారం రోజులుగా అత్యంత సన్నిహితులతో మాత్రం జగన్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఛార్జ్ షీటులో జగన్ పేరును సిట్ అధికారులు ప్రస్తావించారు. దీంతో ఈ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కొవాలి.. అరెస్టు అయితే పరిణామాలు ఎలా ఉంటాయి.. ప్రజల్లో సానుభూతి వస్తుందా.. లేక వ్యతిరేకత వస్తుందా.. అనే విషయంపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే లిక్కర్ స్కామ్‌పై ఢిల్లీ పెద్దలతో కూడా జగన్ లాబీయింగ్ జరుపుతున్నారనే మాట వైసీపీలోనే వినిపిస్తోంది. ప్రతి మంగళవారం తాడేపల్లి వచ్చి.. గురువారం తిరిగి బెంగళూరు వెళ్లిపోతున్నారు జగన్. కానీ రెండు వారాలుగా తాడేపల్లి వైపు రాలేదు. తెర వెనుక ప్రయత్నాలు ఫలిస్తే.. అప్పుడు తాడేపల్లికి వస్తారని.. లిక్కర్ కేసు అక్రమమని ఎదురుదాడి చేస్తారనేది పార్టీ నేతల మాట. ప్రస్తుతం ఎంపీ నిరంజన్ రెడ్డి సారధ్యంలో వైసీపీ లీగల్ టీమ్‌ ఈ లిక్కర్ కేసుపై తలమునకలై ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు భయంతోనే జగన్ ఏపీ వైపు రావడం లేదనే మాట ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

పోల్స్