వైసీపీ అధినేతలో మార్పు వచ్చిందా..? వైసీపీ నేతలను ఆ విషయంలో అధినేత జగన్ కంట్రోల్ చేస్తున్నారా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇంతకు అదే విషయం అనుకుంటున్నారా.. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విషయంలో వైసీపీ అధినేత ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఫుల్ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఒకరిద్దరు గల్లీ స్థాయి నేతలు తప్ప.. పై స్థాయిలో ఎవరూ పవన్ విషయంలో పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. ఇంకా చెప్పాలంటే.. కనీసం నోరు కూడా ఎత్తటం లేదు.
Also Read : జనాభా పెరుగుదలపై చంద్రబాబు ఫోకస్.. సంచలన నిర్ణయాల దిశగా సర్కార్..!
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు పవన్ కల్యాణ్‌పై వైసీపీలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరు నోరు పారేసుకున్నారు. చివరికి సీఎం కుర్చీలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అధికారిక కార్యక్రమాల్లో, ఎన్నికల ప్రచారంలో కూడా పవన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంకా చెప్పాలంటే 3 పెళ్లిళ్లు, 4 పెళ్లిళ్లు అంటూ వ్యక్తిత్వ హననం కూడా చేశారు. ఇక రాష్ట్రవ్యాప్త పర్యటన కోసం సిద్ధం చేసుకున్న వారాహి వాహనంపై కూడా నాడు వైసీపీ నేతలు విమర్శలు, సెటైర్లు వేశారు. నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు అయిన సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేందుకు సిద్ధమైన పవన్‌ను రాష్ట్ర సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు.
Also Read : నారాయణ గారు.. ఏమిటా దూకుడు..!
ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో నడిరోడ్డుపై పవన్ పడుకుని నిరసన తెలియజేయడంతో.. నాటి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై ఏపీ మొత్తం భగ్గుమంది. దీంతో.. చివరికి పవన్‌ను రాష్ట్రంలోకి అనుమతిచ్చారు. వైసీపీ నేతల తీరుపైన, పార్టీ అధినేత జగన్‌పైన పవన్ తనదైన శైలిలో రెచ్చిపోయారు. తాడేపల్లి గూడెంలో నిర్వహించిన సభలో వైసీపీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ అధినేతకు అయితే.. “జగన్ గుర్తు పెట్టుకో.. నిన్న అధఃపాతాళానికి తొక్కకపోతే.. నా పేరు పవన్ కల్యాణ్ కాదు..” అంటూ చెప్పి మరి దెబ్బ కొట్టారు పవన్. వై నాట్ 175 అని గొప్పలకు పోయిన జగన్‌కు చివరికి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేశాడని వైసీపీ నేతలే వ్యాఖ్యలు చేశారు. ఇక వైసీపీలో కీలక వ్యక్తులు, జగన్ అత్యంత సన్నిహితులు కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి.. పవన్‌తో జత కట్టారు. దీంతో పవన్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో జగన్‌కు తెలిసినట్లుంది.
Also Read : ఫ్రీ లాన్స్ వీసా ఆఫర్ చేస్తోన్న జర్మనీ.. రూల్స్ ఇవే..!
పవన్ గురించి తొలినాళ్లల్లో తక్కువగా అంచనా వేసిన జగన్.. ఎన్నికల్లో ఓటమి తర్వాత తన తీరు మార్చుకున్నారు. ఫలితాలు వెలువడిన రోజే.. పవన్ కల్యాణ్ గారు అంటూ సంబోధించారు. ఆ తర్వాత నుంచి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు తప్ప.. పవన్ పేరు ఎత్తటం లేదు. చంద్రబాబు, రెడ్ బుక్ పాలన అంటున్నారు తప్ప.. ఒక్కసారిగా కూడా పవన్ పేరు ప్రస్తావించటం లేదు జగన్. ఇక తాజాగా పవన్ కొత్త హరిహర వీరమల్లు విడుదల వ్యవహారంలో పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. హరిహర వీరమల్లుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించినట్లు సమాచారం. అలా చేయటం వల్ల పవన్ అభిమానులు వైసీపీని టార్గెట్ చేస్తారని.. కాబట్టి ఆ సినిమా జోలికి వెళ్లొద్దని.. నెగిటివ్ కామెంట్లు చేయవద్దని సూచించినట్లు తెలుస్తోంది. అందుకే నిత్యం పవన్ పై సెటైర్లు వేసే అంబటి రాంబాబు కూడా సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఒకరిద్దరు కిందిస్థాయి నేతలు సినిమాపై కామెంట్లు చేసినప్పటికీ.. రాష్ట్ర స్థాయి నేతలు మాత్రం ఈ సినిమా గురించి, పవన్ గురించి కనీసం పల్లెత్తు మాట కూడా అనటం లేదు.