Friday, September 12, 2025 02:55 PM
Friday, September 12, 2025 02:55 PM
roots

ఎన్టీఆర్ పై బాలీవుడ్ జనాల కుళ్ళు.. ఆల్ఫా మేల్ కాదంటూ కామెంట్

ఆర్ఆర్ఆర్, దేవర సినిమాలతో పాన్ ఇండియా వైడ్ గా తాను ఏంటో ప్రూవ్ చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వార్ -2 సినిమా ద్వారా బాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాపై బాలీవుడ్, టాలీవుడ్ తో పాటుగా సౌత్ ఇండియాలో పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ టైం ఎన్టీఆర్ విలన్ గా చేయడంతో సినిమాలో అతని పాత్ర ఎలా ఉంటుంది అనే ఆసక్తి పెరిగిపోయింది. ఈ ఏడాది ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జూ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది.

Also Read : ఆ కేసుల పరిస్థితి ఏమిటీ..?

ఆదిత్య చోప్రా నిర్మాణ సారధ్యంలో వస్తోన్న ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 25 ఏళ్ల సినీ ప్రయాణాన్ని హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరూ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ‘వార్ 2’ ట్రైలర్‌ ను రిలీజ్ చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రకటించింది. ఫస్ట్ పార్ట్ కు మించి రెండో పార్ట్ ఉండబోతుంది అనే క్లారిటీ ట్రైలర్ తో వచ్చేసింది. యాక్ష‌న్ సీన్స్ హాలీవుడ్ లెవ‌ల్‌ లో ప్లాన్ చేసాడు డైరెక్టర్. యాక్షన్ సీన్స్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అయితే డైలాగ్స్ విషయంలో కాస్త జాగ్రత తీసుకుని ఉంటే బాగుందేదన్న అభిప్రాయం ఫాన్స్ నుంచి వినిపిస్తుంది. ట్రైలర్ లో డైలాగ్స్ ని విన్నప్పుడు, డబ్బింగ్ డైలాగ్స్ లాగా ఉన్నాయి అనిపించిది అన్న భావన వచ్చిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి.

Also Read : థాయిలాండ్ లో బయటపడిన వెయ్యేళ్ళ నాటి శివాలయం.. ఆధారాలు ఇవే..!

సాధారణంగా బాలీవుడ్ సినిమాల్లో విలన్ ను తక్కువ చేస్తారనే ఆరోపణలు ఉంటాయి. ఎన్టీఆర్ విషయంలో మాత్రం అలా చేయలేదు అంటున్నారు ఫ్యాన్స్. ఆగస్ట్ 15 సందర్భంగా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపొయింది. ఇదే టైం లో బాలీవుడ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ పై తమ అక్కసు బయటపెడుతున్నారు. ఎన్టీఆర్ అసలు హృతిక్ రోషన్ కు మ్యాచ్ కాలేదని ట్రోల్ చేస్తున్నారు. వార్ ఫస్ట్ పార్ట్ లో టైగర్ ష్రాఫ్ ను చూసి ఇప్పుడు ఎన్టీఆర్ చూడాలంటే కష్టంగా ఉందని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. రాజమౌళి, ఎన్టీఆర్ ను చూపించినంత పవర్ ఫుల్ గా అయాన్ ముఖర్జీ చూపించలేదని, జూనియర్ ఎన్టీఆర్ కంటే, కియారా అద్వానీ యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా కనిపించిందని కామెంట్ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు. వార్ 2 అనేది ఆల్ఫా మేల్ కాన్సెప్ట్ అని, ఎన్టీఆర్ ఆ రేంజ్ లో లేడు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్