Wednesday, August 5, 2026 12:53 PM
Wednesday, August 5, 2026 12:53 PM

ఫ్రీలాన్స్ వీసా ఆఫర్ చేస్తోన్న జర్మనీ.. రూల్స్ ఇవే..!

విదేశాలకు వెళ్ళాలి అనేది చాలా మంది భారతీయుల కల. ముఖ్యంగా ఉత్తర అమెరికా, యూరప్ దేశాల్లో అడుగుపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయా దేశాలు కూడా భారతీయులకు ఎన్నో ఆఫర్లు ఇస్తున్నాయి. లేటెస్ట్ గా జర్మనీ కూడా ఫ్రీ లాన్స్ వీసాను ఆఫర్ చేస్తోంది. ఉద్యోగాలు ఉంటేనే వీసా ఇచ్చే జర్మని, ఇప్పుడు కాస్త రూల్స్ మారుస్తోంది. జీవితాన్ని నిర్మించుకోవడానికి తాము అవకాశం ఇస్తామని చెప్తోంది. అసలు జర్మనీ ఫ్రీలాన్స్ వీసా అంటే ఏమిటి?

Also Read : థాయిలాండ్ లో బయటపడిన వెయ్యేళ్ళ నాటి శివాలయం.. ఆధారాలు ఇవే..!

జర్మనీ ఫ్రీలాన్స్ వీసా అనేది యూరోపియన్ యేతర పౌరులు దేశంలో చట్టబద్ధంగా నివసించడానికి, కొన్ని ప్రొఫెషనల్ రంగాల్లో పని చేసుకోవడానికి అనుమతించే వీసా. టూరిస్ట్ వీసా లేదా స్పాన్సర్ షిప్ వీసాలా కాకుండా వీసా ఉన్న వాళ్ళు, పలు రంగాల్లో పని చేసుకునేలా వీసా అందిస్తారు. కంటెంట్ క్రియేటర్లు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, కన్సల్టెంట్లకు అనువుగా ఉంటుంది ఈ వీసా. ఆఫీసుతో సంబంధం లేకుండా, ఎవరైనా ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు.

వీసా సాధారణంగా ఒక సంవత్సరం పాటు ఇస్తారు. దానిని పొడిగించే అవకాశం కూడా ఉంది. మీరు ఆ దేశ షరతులకు అనుగుణంగా ఉంటే – కొనసాగుతున్న ఫ్రీలాన్స్ జాబ్, ఇన్కం ప్రూఫ్, ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఆధారంగా మూడేళ్ళ వరకు పొడిగించవచ్చు. ఐదు సంవత్సరాలు అక్కడే ఉండి, కొన్ని అర్హతలు పూర్తి అయిన తర్వాత, శాశ్వత నివాసానికి కూడా అర్హులు కావచ్చు.

Also Read : మాకు ఈ పెళ్లిళ్లు వద్దు బాబోయ్..!

జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, రచయితలు, సంపాదకులు, వ్యాఖ్యాతలు, అనువాదకులు, ఆర్కిటెక్ట్‌ లు, ఇంజనీర్లు, సర్వేయర్లు, దృశ్య కళాకారులు, సంగీతకారులు,డిజైనర్లు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, పరిశోధకులు, న్యాయవాదులు, పేటెంట్ ఏజెంట్లు, పన్ను సలహాదారులు, అకౌంటెంట్లు, ఫిజియోథెరపిస్టులు, దంతవైద్యులు, పశువైద్యులు వంటి వైద్య మరియు చికిత్సా నిపుణులు, పైలట్లు మరియు విమానయాన నిపుణులు వంటి వారికి జర్మనీ స్వాగతం పలుకుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

పోల్స్