హిందు దేవాలయాలకు సంబంధించి సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఇందులో కొన్నిటికి ఆధారాలు లేకపోయినా.. మరికొన్ని మాత్రం ఆధారాలతో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా థాయ్లాండ్ లో పురాతన శివాలయం ఒకటి బయటపడింది. ఆ శివాలయం 11 శతాబ్దానికి చెందినదిగా గుర్తించారు. ప్రస్తుతం కంబోడియా, థాయ్లాండ్ దేశాల మధ్య వాతావారణం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం థాయ్ దళాలు దట్టమైన, పర్వత ప్రాంతాలైన డాంగ్రెక్ సరిహద్దులో కంబోడియాన్ డ్రోన్‌ను గుర్తించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
Also Read : శ్రీ సిటీ కీలక ఒప్పందం… ఇక ఆ గ్యాస్ ఇక్కడి నుంచే..!
ఈ సంఘటన తర్వాత కాల్పులు, రాకెట్ దాడులు పెరిగాయి. వైమానిక దాడులు కూడా జరిగాయి. రెండు ఆగ్నేయాసియా దేశాల మధ్య సైనిక ఘర్షణల కేంద్రంగా ఒక పురాతన సరిహద్దు వివాదం నడుస్తోంది. ఫ్రెంచ్ పాలకులు వదిలిపెట్టిన వలస వారసత్వంగా చెప్తున్నారు. ఇక్కడ 11వ శతాబ్దం నాటి మూడు పురాతన హిందూ దేవాలయాలను గుర్తించారు. ప్రస్తుత యుద్ధ కేంద్రం థాయిలాండ్-కంబోడియా సరిహద్దు వెంబడి ఉన్న దట్టమైన అడవులపై ఉన్న ప్రసాత్ తా ముయెన్ థామ్ ఆలయానికి సమీపంలో ఉంది.
రాతితో తయారు చేసిన శివలింగం, సంస్కృత శాసనాలు కలిగిన దేవాలయం ఉన్నాయి. ప్రాచీన భారతీయ సంస్కృతి, కళారూపాలను ఇక్కడ గుర్తించారు. 11వ శతాబ్దంలో రాజు ఉదయాదిత్యవర్మన్ II ఆధ్వర్యంలో నిర్మించిన ఖైమర్ హిందూ ఆలయం ఉంది. ఇది శివాలయంగా గుర్తించారు. కంబోడియాలోని ఒడ్డార్ మీన్చే ప్రావిన్స్ మరియు థాయిలాండ్‌లోని సురిన్ ప్రావిన్స్ మధ్య వివాదాస్పద సరిహద్దులో ఈ ఆలయం ఉండటంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారింది.
Also Read : ఓన్లీ క్యాష్.. నో యూపీఐ ప్లీజ్.. వ్యాపారులకు షాక్..!
చారిత్రక ఖైమర్ సామ్రాజ్య సరిహద్దుల ఆధారంగా కంబోడియా తమదిగా చెప్తోంది. థాయిలాండ్ ఆ ప్రాంతం తన భూభాగంలోనే ఉందని వాదిస్తోంది. టా ముయెన్ థామ్ ను శివాలయంగా గుర్తించారు. ఆ దేవాలయం గర్భగుడిలో సహజ శిలల నుండి ఏర్పడిన శివలింగాన్ని ప్రతిష్టించారు. ఈ దేవాలయం దీర్ఘచతురస్రాకారంలో ఉందట. దక్షిణం వైపు ప్రధాన ద్వారం ఉంటుంది. ఖైమర్ దేవాలయాలు అన్నీ తూర్పు ద్వారంలో ఉంటే ఈ దేవాలయం మాత్రమే దక్షిణ ముఖంగా ఉంటుంది. ఈ దేవాలయం గోపురం విశాలమైన లాటరైట్ మెట్లు కంబోడియా వైపు దిగుతాయి. ఈ దేవాలయంపై హిందూ దేవుళ్ళ చిత్రాలు కూడా ఉన్నాయి. సంక్లిష్టమైన శిల్పాలు, గుప్తుల అనంతర భారతీయ కళలు ఇక్కడ ఉన్నాయి. గుప్త సామ్రాజ్యంలో కళలకు సంస్కృతికి ఉన్న ప్రాధాన్యతను ఈ దేవాలయం చూపిస్తోంది.