టీం ఇండియా స్టార్ ఆటగాడు, వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం ఇప్పుడు భారత శిభిరాన్ని కలవరపెడుతోంది. మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ వచ్చిన పంత్.. క్రిస్ వోక్స్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ ఆడబోయి గాయపడ్డాడు. ఈ సీరీస్ లో అతను జట్టుకు కీలకంగా మారాడు. 7 ఇన్నింగ్స్ లలో మొత్తం 450కి పైగా పరుగులు చేసాడు పంత్. అందులో రెండు సెంచరీలు రెండు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ మ్యాచ్ లో కూడా కీలక సమయంలో వికెట్ కాపాడుకుని స్ట్రైక్ రొటేట్ చేస్తూ వచ్చాడు.
Also Read : ఉప రాష్ట్రపతిగా కేంద్ర మంత్రి.. కేంద్ర కేబినేట్ లో యోగి..?
ఈ క్రమంలో ఇంగ్లాండ్ పై ఒత్తిడి పెంచాలని ప్రయత్నం చేసిన పంత్.. తీవ్రంగా గాయపడ్డాడు. కాలి బొటని వేలుకి గాయం కావడంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత జడేజా బ్యాటింగ్ కు వచ్చాడు. ఒకవేళ పంత్ రెండవ రోజు బ్యాటింగ్ చేయకపోతే మాత్రం అది భారత విజయంపై ప్రభావం పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పంత్ కారణంగానే మూడవ టెస్ట్ లో భారత్ ఓడిపోయింది. అతను కీపింగ్ లో లేకపోవడం ఒకటి అయితే, కీలక సమయంలో మొదటి ఇన్నింగ్స్ లో రనౌట్ కావడం జట్టుపై ప్రభావం చూపింది.
Also Read : ఇటలీలో రేసింగ్ ప్రమాదం.. మరోసారి సురక్షితంగా బయటపడ్డ హీరో అజిత్
ఇక ఇప్పుడు పంత్ గాయం చూస్తుంటే అతను మిగిలిన సీరీస్ కు అందుబాటులో ఉండకపోవచ్చు అంటున్నాయి భారత క్రికెట్ వర్గాలు. బంతి బలంగా తాకడంతో పంత్ మైదానంలో బాగా ఇబ్బంది పడ్డాడు. మూడవ టెస్ట్ లో కూడా చేతి వేలుకి అయిన గాయంతో ఇబ్బంది పడ్డాడు ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ప్రస్తుతం అతనిని స్కానింగ్ కు పంపామని బోర్డు ప్రకటించింది. గాయం తీవ్రత ఆధారంగా అతనిని ఆడించాలా వద్దా అనే దానిపై జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకోనుంది.