Sunday, October 19, 2025 03:46 PM
Sunday, October 19, 2025 03:46 PM
roots

ఏపీలో మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఫిక్స్..!

ఏపీలో మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారైందా..? దాదాపు 8 మంది మంత్రులకు ఉద్వాసన తప్పదా..? జగన్ మోహన్ రెడ్డి దూకుడు నేపథ్యంలో సీనియర్లకు స్థానం కల్పించాలని పసుపు దళపతి చంద్రబాబు భావిస్తున్నారా..? జగన్ త్వరలో పాదయాత్ర ప్రారంభించడం ఖాయమేనా..? తొలగించే మంత్రులెవరు..? అదృష్ణం వరించేది ఎవర్నీ..? కమ్మ సామాజిక వర్గానికి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కనుందా..? పల్నాడు జిల్లాకు ఈసారి అవకాశం దక్కనుందా..? కొత్త క్యాబినెట్‌పై పార్టీ వర్గాల్లో విస్తృత చర్చపై మహానాడు పత్రిక ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు మార్తి సుబ్రహ్మణ్యం ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగ్.

Also Read : మహిళ దెబ్బకు షాక్ అయిన సుప్రీం ఛీఫ్ జస్టిస్

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 13 నెలలు దాటింది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే చర్చ విస్తృతంగా నడుస్తోంది. ఈ మేరకు పార్టీ వర్గాల్లో కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీని కంటే ముందు ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు ఉంటాయని ఎప్పటి నుంచో ప్రచారం నడుస్తోంది. ఈ నెల 30న చంద్రబాబు సింగపూర్ పర్యటన ముందే బదిలీలు ఉంటాయంటున్నారు ప్రభుత్వ పెద్దలు. సీఎం సింగపూర్ పర్యటన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావిస్తున్నారు. ఆగస్టు 6న ముహుర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. నిజానికి ఆగస్టులో విస్తరణ ఉంటుందనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతోంది. ఈ విస్తరణలో సుమారు 8 మందిపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాది పాలనలో వారికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదనే మాట బాగా వినిపిస్తోంది. నియోజకవర్గంలో, జిల్లాతో పాటు తమకు కేటాయించిన శాఖపై కూడా ఆయా మంత్రులు పట్టు సాధించలేదని.. అందుకే వారిపై వేటు పడుతోందనేది పార్టీ వర్గాల మాట.

ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న వారిలో వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, రాంప్రసాద్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, పార్థసారథి, కందుల దుర్గేష్, అచ్చెన్నాయుడు, సంధ్యారాణి వారిపై వేటు ఖాయమనే మాట వినిపిస్తోంది. వీరిలో సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, అచ్చెన్నాయుడు పై వేటు ఖాయమనేది ముందు నుంచి వినిపిస్తున్న మాట. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్న పల్లా శ్రీనివాస్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు గతంలోనే ప్రకటించారు. ఆయన స్థానంలో మరోసారి అచ్చెన్నాయుడుకు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లాకు ఛాన్స్ ఇస్తే.. పార్థసారథిని తొలగించడం ఖాయమంటున్నారు. ఇక ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామ కృష్ణరాజుకు క్యాబినెట్ బెర్త్ ఖాయమంటున్నారు. క్షత్రియ వర్గం నుంచి ప్రస్తుతం ఏడుగురు ఎమ్మెల్యేలున్నారు. కానీ క్యాబినెట్‌లో వారికి చోటు దక్కలేదు. ఆ లోటును రఘురామ కృష్ణరాజుతో భర్తీ చేయనున్నారు చంద్రబాబు.

Also Read : ఇటలీలో రేసింగ్ ప్రమాదం.. మరోసారి సురక్షితంగా బయటపడ్డ హీరో అజిత్

గెలిచిన తొలిసారే మంత్రి పదవి దక్కించుకున్నారు వాసంశెట్టి సుభాష్. సరిగ్గా ఎన్నికలకు 4 నెలల ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆ పనితీరుపై చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు కూడా అసంతృప్తితో ఉన్నారు. దీంతో సుభాష్ తొలగింపు ఖాయమనే మాట తెలుస్తోంది. ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన పితాని సత్యనారాయణకు అవకాశం ఇస్తారా… లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుత క్యాబినెట్‌లో క్షత్రియ, కళింగ, గవర వంటి కులాలకు ప్రాతినిధ్యం లేదు. దీంతో ఆయా సామాజిక వర్గాలు కాస్త అసహనంతో ఉన్నాయి. వీరికి ఈ సారి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.

ఇక జనసేన ఖాతాలో మరో మంత్రి పదవి చేరే అవకాశం ఉంది. ఇప్పటికే పవన్ కల్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లు జనసేన తరఫున మంత్రులుగా ఉన్నారు. వీరిలో దుర్గేష్‌ను తొలగించవచ్చనే మాట వినిపిస్తోంది. ఈయన స్థానంలో పవన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఖాయమంటున్నారు. నాగబాబుకు మంత్రి పదవి అని ఈ ఏడాది జనవరిలోనే చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. ఇక జనసేనకు చెందిన కొణతాల రామకృష్ణకు మంత్రిగా అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో హోమ్ మంత్రి అనితను కొనసాగిస్తారా… శాఖ మారుస్తారా అనే విషయంపై పార్టీలో విస్తృతంగా చర్చ నడుస్తోంది.

Also Read : దుబాయ్ ను చూస్తే అసూయ.. చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్

అనిత పీఏ జగదీష్‌పై లెక్కలేనన్ని ఆరోపణలు రావడంతో.. అతన్ని తొలగిస్తున్నట్లు అనిత స్వయంగా ప్రకటించారు. వీటితో పాటు పోలీసు శాఖలో ఇటీవల జరిగిన కంప్యూటర్ల కొనుగోలు వ్యవహారం ప్రభుత్వాన్నికి బాగా చెడ్డపేరు తీసుకువచ్చింది. దీంతో ఆమెను కూడా తప్పిస్తారనే మాట వినిపిస్తోంది. అయితే ఎస్సీ వర్గానికి చెందిన అనితను తొలగిస్తే.. ఆమె స్థానంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకు ఛాన్స్ వస్తుందంటున్నారు. నెల్లూరు జిల్లా నుంచి మంత్రిగా అవకాశం దక్కించుకున్న ఆనం రామనారాయణ రెడ్డి పేరు కూడా మార్పు జాబితాలో ఉంది. ఆయన స్థానంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తొలి నుంచి పార్టీలోనే కొనసాగుతున్న నేత సోమిరెడ్డి. 2014-19 మధ్య కాలంలో కూడా సోమిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి మంత్రి రాంప్రసాద్ రెడ్డిని తప్పించి.. ఆయన స్థానంలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కొండపల్లి శ్రీనివాస్‌ను తొలగించి.. ఆయన స్థానంలో సీనియర్ నేత కళా వెంకట్రావుకు మంత్రి పదవి వస్తుందంటున్నారు పార్టీ సీనియర్ నేతలు. ఇటీవలి కాలంలో ఉత్తరాంధ్రలో కాపుల ప్రాధాన్యత తగ్గిపోతోందని.. వారి స్థానాన్ని వెలమ వర్గం ఆక్రమించుకుంటోందన్న విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో కీలక స్థానాల్లో ఉన్న కాపులను బదిలీ చేసి, కింజరాపు కుటుంబం – సీఎంఓలోని ఓ కీలక అధికారి కలసి, తమ సామాజికవర్గానికి చెందిన అధికారులను ఆ స్థానాల్లో నియమించుకోవడంపై.. కాపులు సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. విశాఖలోని గంటా నియోజకవర్గంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారి బదిలీ ఈ వివాదానికి దారితీసింది. ఆ క్రమంలో కాపు సంఘం నాయకులంతా గంటా వద్ద తమ నిరసన వ్యక్తం చేసినట్లు జోరుగా ప్రచారం జరిగింది. విద్యుత్ శాఖ యూనియన్ నాయకుడు, సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక నేతగా పనిచేసిన అధికారిని బదిలీ చేసి, ఆయన స్థానంలో వెలమ అధికారిని నియమించడమే ఈ వివాదానికి కారణం.

Also Read : బ్రేకింగ్: ఫోన్ ట్యాపింగ్ విచారణ సిబిఐ చేతికే..?

ఉత్తరాంధ్రలో అధికంగా ఉన్న కాపులకు బలమైన నాయకుడిని లేకుండా చేశారని కాపు సామాజిక వర్గంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీలక పదవులు, అవకాశాలు వెలమ వర్గానికే ఇస్తున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీలో సీనియర్ నేత కళా వెంకట్రావుకు అవకాశం ఉంటుందనే మాట బాగా వినిపిస్తోంది. ప్రస్తుతం కమ్మ సామాజికవర్గానికి ఈసారి మాత్రం సరైన ప్రాధాన్యం ఉంటుందంటున్నారు పార్టీ పెద్దలు. ప్రస్తుతం లోకేష్, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్ క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గొట్టిపాటి రవికుమార్ పెద్దగా ప్రభావితం చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత జిల్లాలో కూడా రవికుమార్ తీరుపై సొంత సామాజికవర్గ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇక ప్రస్తుతం కీలకమైన ఆర్థిక శాఖ నిర్వహిస్తున్న పయ్యావుల కేశవ్.. తన శాఖ మార్పు కోరుకుంటున్నారు.

తెలుగుదేశంపార్టీలో కోడెల, తుమ్మల, పరిటాల స్థాయిలో నాయకులు లేరనే అసంతృప్తి కమ్మవర్గంలో స్పష్టంగా కనిపిస్తోంది. దూకుడుగా వ్యవహరించే కరణం బలరామ్ పార్టీ మారగా.. ఇమేజ్ ఉన్న దేవినేని ఉమకు టికెట్ ఇవ్వలేదు. బుచ్చయ్యచౌదరి – యరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యేలుగా పరిమితం అయ్యారు. సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు సంగం డైరీ వివాదం వల్ల మంత్రి పదవి రాకుండా పోతోందంటున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుకు మంత్రి పదవి ఇస్తే, ఆయన స్థానంలో సీనియర్ నేత, వివాద రహితుడైన గోరంట్ల బుచ్చయ్యచౌదరికి అవకాశం వస్తుందనంటున్నారు పార్టీ నేతలు. అయితే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రస్తుతం ఆ పదవిలో అంత సంతృప్తిగా లేరనేది వాస్తవం. ఆయన కూడా మంత్రి పదవి కోరుకుంటున్నారు. అచ్చెన్నాయుడుకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే, ఆయన స్థానాన్ని అయ్యన్న పాత్రుడుతో భర్తీ చేసే అవకాశం ఉంది. స్పీకర్ పదవిని సీనియర్‌కు కేటాయించే అవకాశం ఉంది.

Also Read : ఏపీలో కొత్త జిల్లా.. అమరావతిపై చంద్రబాబు సంచలన నిర్ణయం

వీరితో పాటు మంత్రి ఫరూఖ్, సవిత, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, బీసీ జనార్దన్‌రెడ్డి, వీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్ర శాఖలు మారే అవకాశం ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో జర…

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్