తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు వ్యక్తిగత దూషణలు కూడా చేసుకుంటున్నారు. అటు తెలంగాణలో, ఇటు ఏపీలో కూడా ఈ దూషణల పర్వం తారాస్థాయికి చేరుకుంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్‌పై వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక వైసీపీ అధినేత పర్యటనల్లో అయితే రప్పా రప్పా నరుకుతాం అని బ్యానర్లు కూడా పెడుతున్నారు. ఇక మాజీ మంత్రులు పేర్ని నాని, రోజా, అంబటి రాంబాబు అయితే.. రాయలేని భాషలో రెచ్చిపోతున్నారు. మేము తలుచుకుంటే మీరెంత అని వార్నింగ్ ఇస్తున్నారు. ఇక పేర్ని నాని అయితే.. అరెస్టు చేసుకో.. నెల రోజుల తర్వాత బయటకు వస్తాం.. ఏం చేయగలవు అంతకంటే.. అంటున్నారు.
Also Read : జూబ్లీహిల్స్ బై పోల్.. సీన్‌లోకి కొత్త పేరు..!
అటు తెలంగాణలో కూడా దూషణల పర్వం తారాస్థాయికి చేరుకుంది. తొలి నుంచి తిట్టు కోవడం తెలంగాణలో సర్వ సాధారణం. ఇదే మా యాస అంటున్నారు తెలంగాణ నేతలు. వయో బేధం లేదు.. స్థాయి అసలే తెలియదు.. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడంలో దిట్ట.. ఇవన్నీ భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, మాజీ సీఎం దగ్గర నుంచి ఆ పార్టీ నేతలు నేర్చుకున్న పాఠం. పక్క రాష్ట్రం వారిపై విద్వేషపు ప్రసంగం, తిండి, కట్టు, బొట్టు.. చివరికి అర్చకులపై కూడా దూషణలు.. ఇక స్వరాష్ట్రంలో కూడా తాము అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతలపై అదే స్థాయిలో రెచ్చిపోయారు. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిపై కూడా అదే స్థాయిలో నోటీకి వచ్చినట్లు వ్యాఖ్యానించారు. దీంతో వరుసగా రెండుసార్లు అధికారంలో కూర్చొబెట్టిన ప్రజలు.. మూడోసారి మాత్రం ఇంటికి పంపేశారు.
అధికారం కోల్పోయినా సరే.. బీఆర్ఎస్ నేతలు మాత్రం తమ నోటికి పని చెప్తూనే ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి రెచ్చిపోయారు. రాయలేని భాషలో దూషించారు. ఇదంతా రేవంత్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో కేటీఆర్ తన నోటికి పని చెప్పారు. ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేష్‌ను కేటీఆర్ రహస్యంగా 3 సార్లు కలిశారన్నారు రేవంత్ రెడ్డి. అసలు అలా సీక్రెట్‌గా కలవాల్సిన అవసరం ఏమిటని రేవంత్ రెడ్డి నిలదీశారు. ఇవే ఆరోపణలను గతంలో కాంగ్రెస్ నేతలు కూడా చేశారు. అయితే అప్పట్లో పెద్దగా పట్టించుకోని కేటీఆర్.. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే తరహా ఆరోపణలు చేయడంతో.. దీనిపై ఘాటుగా స్పందించారు.
Also Read : మిథున్ కోసం సిట్ జల్లెడ.. ఎక్కడున్నాడో..?
నేనేదో లోకేష్‌ను కలిశానంట.. అది కూడా అర్థరాత్రి పూట అంట.. మేమేం చేసినా బాజాప్తా చేస్తం.. బేజాప్తా చేయాల్సిన ఖర్మ మాకు లేదు. అయినా నాకు తెల్వక అడుగుతా… లోకేష్ ఏమైనా నీలెక్క అంతరాష్ట్ర దొంగనా.. లోకేష్ ఏమైనా నీలెక్క సంచులు మోసేటోడా.. లోకేష్ ఏమైనా నీలెక్క చదువు రానోడా.. కలిస్తే తప్పేంటి.. కలవలేదు.. కలిస్తే తప్పేంది. అయినా నాకు తెల్వక ఇంకో మాట అడుగుతా.. పక్క రాష్ట్ర మంత్రి, యువకుడు, నాతో సత్సంబంధాలున్నయి. మేమిద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటం. కలవలేదు.. కానీ కలిస్తే తప్పేంది. నాకు తెల్వక అడుగుతా.. అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే గదా.. నేనేదో గూండానో.. దావూద్ ఇబ్రహీమ్‌నో చీకట్లో కలిసినట్లు.. డైలాగులేంది రా.. హౌ.. నేనడిగిందేంది.. నేనే చెప్పిందేంది.. నేనేమన్న దొంగను కలిసిన్నా నీలాగ.. లేదంటే నీలాగ నేనేమన్న లోఫర్ రాజకీయాలు చేసిన్నా ఢిల్లీలో.. చీకట్లో పొయ్యి అమిత్ షా కాళ్లు పట్టుకుని.. చీకట్లో బొయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి.. చిల్లర రాజకీయం చేస్తున్నన్న.. పక్క రాష్ట్ర మంత్రి, యువకుడు, నాకు తమ్ముడు లాంటోడు.. కలిస్తే కలుస్తా.. కానీ నేను కలవలేదు.. దానికేదో పెద్ద.. ఈయనేదో పెద్ద విషయం కనిపెట్టినట్లు.. అయినా నాకు తెల్వక అడుగుతా.. పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే కలుస్తరు బీఆర్ఎస్ వాళ్లను.. దోపిడీ గురించి తెలుసుకోవాలంటే.. నిన్ను కలుస్తరు.. ఆయన నన్ను కలిస్తే నీకేం నొచ్చింది.. ఆయన నన్ను కలిసినా.. నీకేం బాధ అవుతుంది.. అంటూ కేటీఆర్ తనదైన శైలిలో రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.
Also Read : నారా లోకేష్ పైన ఇంత కోపం ఎందుకు..?
కలవలేదు.. కానీ కలిస్తే తప్పేంటి అంటూ పదే పదే వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలపైన ఘాటు వ్యాఖ్యలు చేసిన కేటీఆర్.. ఇప్పుడు మాత్రం.. లోకేష్‌ను యువకుడు, తమ్ముడు అంటూ పొగుడుతున్నారు. లోకేష్ విద్యావంతుడని స్వయంగా ఒప్పుకున్నారు. చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టి అక్రమంగా అరెస్టు చేసినప్పుడు హైదరాబాద్‌లోని టీడీపీ నేతలు, అభిమానులతో పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. దీనిని అప్పట్లో కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. మీ రాష్ట్రం, మా రాష్ట్రం అంటూ తెలుగు వారిని వేరు చేశారు. కానీ ఓడిన తర్వాత ఇప్పుడు మాత్రం.. లోకేష్ నా తమ్ముడు.. అంటూ పెద్ద పెద్ద డైలాగులు వేస్తున్నారు. పరిపాలన గురించి బీఆర్ఎస్ వాళ్ల దగ్గర తెలుసుకుంటారన్న కేటీఆర్.. మాజీ సీఎం కేసీఆర్ కూడా చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా చేసిన విషయం మర్చిపోయారేమో అని పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది.




