Saturday, September 13, 2025 12:46 AM
Saturday, September 13, 2025 12:46 AM
roots

పాకిస్తాన్ షాక్.. కలలో కూడా ఊహించని గన్ తయారు చేసిన భారత్

సరిహద్దు దేశాల నుంచి ముప్పు తీవ్రమైనా సరే ఎదుర్కొనేందుకు భారత్ సిద్దమైంది. ఈ క్రమంలో ఆయుధ సంపత్తిని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తాజాగా శక్తివంతమైన ఆయుధాన్ని భారత్ అభివృద్ధి చేసింది. శక్తివంతమైన ఆర్టిలరీ గన్ ను భారత్ తయారు చేసింది. అమృత్సర్ నుండి లాహోర్ ను లక్ష్యంగా చేసుకుని, దాడులు చేసుకునే సామర్ధ్యం కలిగి ఉన్న ఆయుధం ఇది. భారత ఆయుధ సంపత్తిలో ఇదో కీలక అడుగు అంటున్నారు మాజీ ఆర్మీ అధికారులు.

Also read ; ఆ విషయంలో జగన్ స్టాండ్ ఏమిటో..?

ATAGS (అడ్వాన్స్‌డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్) అని పిలిచే ‘మేడ్-ఇన్-ఇండియా’ గన్ ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రెండు భారత కంపెనీలు- టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, భారత్ ఫోర్జ్ భాగస్వామ్యంతో రూపొందించింది. 307 అడ్వాన్స్‌ డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్, 327 హై-మొబిలిటీ 6×6 గన్ టోయింగ్ వాహనాల తయారి కోసం గానూ భారత ప్రభుత్వం భారత్ ఫోర్జ్ లిమిటెడ్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్‌తో ₹6,900 కోట్ల విలువైన ఒప్పందాలపై సంతకం చేసింది.

Also read ; రోహిత్ – కోహ్లీ రిటైర్మెంట్ పై బోర్డ్ సంచలన కామెంట్స్

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధాలుగా చెప్తోంది ఇండియన్ ఆర్మీ. 48 కిలోమీటర్ల వరకు లక్ష్యాన్ని ఛేదించగలవు. వీటిని భారతదేశంలోని అమృత్‌సర్‌లో మోహరిస్తే, పాకిస్తాన్‌లోని లాహోర్ వరకు దాడి చేసి శత్రువును అంతం చేయగలవు. అమృత్‌సర్ నుండి లాహోర్ వరకు దూరం దాదాపు 55 కి.మీ.. పోఖ్రాన్, బాలసోర్ మరియు కార్గిల్ యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల సమయంలో ఈ ఆయుధానికి సంబంధించిన పరిక్షలు జరిగాయి. అధికారిక లెక్కల ప్రకారం.. 155mm విభాగంలో అత్యంత పొడవైన టార్గెట్ ను కాల్చింది. దీనితో 307 ATAGS తుపాకుల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. వాటి తుది పరీక్షల తర్వాత సైన్యానికి అందిస్తుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్