రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో పోతిరెడ్డి పాడు, నాగార్జున సాగర్, పోలవరం వంటి సమస్యలను చూసిన తెలుగు ప్రజలు ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో ఆసక్తికర పరిణామాలు చూస్తున్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ ను సిఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకోవడం, అటు తెలంగాణా తమకు అన్యాయం జరుగుతుందని వాదించడం వంటివి జరుగుతున్నాయి. గోదావరిలో వృధాగా పోయే నీటిని తాము వాడుకుంటే తెలంగాణాకు ఇబ్బంది ఏంటి అనేది ఆంధ్రా వాదన.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో గవర్నర్ల సందడి..!
ఈ విషయంలో కేంద్రం కూడా ఏపీకి షాక్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు ఇవ్వడానికి కేంద్రం నిరాకరించింది. దీనితో ఈ విషయంలో ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఈ తరుణంలో తెలంగాణాతో చర్చలు జరపాలని ఏపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలకు ఆదిలోనే అడ్డంకి ఏర్పడింది. ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది తెలంగాణా సర్కార్. బనకచర్ల ప్రాజెక్ట్ పై చర్చించడానికి విముఖత వ్యక్తం చేస్తూ లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బనకచర్ల పై సమావేశానికి రేపు ఢిల్లీలో కేంద్రం ఏర్పాటు చేసింది.
Also Read : టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలుంటాయా..?
ప్రస్తుతం తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండగా ఏపీ సిఎం ఢిల్లీ వెళ్తున్నారు. దీనితో కేంద్రం సమక్షంలోనే దీనిపై తేల్చుకోవాలని ప్రయత్నం చేసింది ఏపీ. బనకచర్ల సింగిల్ ఎజెండా తో సమావేశానికి ప్రతిపాదన చేసింది. అయితే చర్చ అవసరం లేదంటూ ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. రెండు రోజులుగా ముఖ్యమంత్రుల సమావేశంపై తెలంగాణ లో జోరుగా చర్చ జరుగుతోంది. లేనిపోని అనుమానాలకు తావివ్వడం ఇష్టం లేకనే తెలంగాణ ప్రభుత్వం చర్చకు నో చెప్పినట్లుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి.