Friday, September 12, 2025 10:35 PM
Friday, September 12, 2025 10:35 PM
roots

ఆ ఇద్దరినే నమ్ముతున్న చంద్రబాబు.. ఐపిఎస్ లే బాబు టార్గెట్..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారుల విషయంలో ఈసారి జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. కొందరు అధికారులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం, కనీసం మంత్రులను కూడా లెక్క చేయకపోవడంతో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఐఏఎస్,ఐపిఎస్‌ల బదిలీలపై ఈసారి సీరియస్‌గా వడపోత కార్యక్రమం నిర్వహిస్తోంది. గతానుభవాలు, విమర్శల నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. అందుకే బదిలీలు ఆలస్యమవుతున్నాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. సిఎస్ విజయానంద్ తో కలిసి సిఎం చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు.

Also Read : గంటాకు కోపం వచ్చింది.. ఈసారి నేరుగానే..!

సీఎంఓలో మిగిలిన వారిని దూరం పెట్టిన బాబు.. ఐపిఎస్ పోస్టింగులపైనే సీరియస్ గా దృష్టి సారించారు. సందేహం వచ్చిన వారిపై అప్పటికప్పుడే ఆరా తీస్తున్నారు. శుక్రవారం నాటికి జాబితా ఖరారవుతుందంటున్న అధికార వర్గాలు.. కీలక మార్పులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నాయి. ఏడాదిలో జరిగిన నియామకాల ఎంపిక లోపాలు.. వాటిపై సొంత పార్టీ వర్గాలు, పార్టీ సోషల్‌మీడియాలో వచ్చిన విమర్శలు-ఆరోపణల అనుభవాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే వీటి విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read : మద్యం కోసం వైసీపీ నేతల హడావుడి.. జగన్ టూర్ లో ఇంట్రస్టింగ్ సీన్స్

దీని కారణంగానే ఎప్పుడో పూర్తి కావాల్సిన ఎంపిక వాయిదా పడింది. ఐపిఎస్ ల విషయంలోనే ఎక్కువ ఆరోపణలు వచ్చాయి. పార్టీ కార్యకర్తలు ఎక్కువ విమర్శలు చేసింది వారి పైనే. వైసీపీ అనుకూల అధికారులుగా వ్యవహరించిన వారికి కీలక పోస్టింగ్ లు ఇవ్వడం వంటివి చికాకుగా మారాయి. చంద్రబాబును అరెస్టు చేసిన అప్పటి డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డిని పక్కనపెట్టకుండా…ఇంకా కొనసాగించటంపై పార్టీ వర్గాల్లో విమర్శలు వచ్చాయి. జిల్లాల్లో వైసీపీ నేతలకు సహకరించే ఐపిఎస్ అధికారుల విషయంలో సైతం వివాదం రేగింది. ఈ కసరత్తు ప్రక్రియలో సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి మద్దాడ రవిచంద్ర కూడా పాల్గొన్నట్టు సమాచారం. సిఎంఓ అధికారులపై కూడా చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. కొందరు వివాదాస్పదంగా వ్యవహరించడం తలనొప్పిగా మారింది. సిఎంవో లో జరిగే వ్యవహారాలను పదే పదే బయటపెడుతున్నారు అనే విమర్శలు సైతం కొందరు అధికారులపై ఉన్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్