గత నెలలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశ చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనలలో ఒకటిగా నిలిచింది. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు బృందాలు విచారణ కొనసాగిస్తున్నాయి. ఎయిర్ ఇండియా 171 విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తన ప్రాథమిక నివేదికను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఇతర సంబంధిత అధికారులకు సమర్పించిందని జాతీయ మీడియా వెల్లడించింది. ప్రాధమిక విచారణ, ఆ తర్వాత సేకరించిన కీలక అంశాలతో ఈ నివేదికను తయారు చేసారు.
Also Read : ఓడినా .. తగ్గని నోటి దూల..!
ఈ వారం చివర్లో ఈ నివేదికను ప్రజల ముందుకు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక నివేదికలోని విషయాలు తెలియనప్పటికీ, ప్రమాదానికి కారణమైన దాని గురించి కీలకమైన సమాచారాన్ని ఇది బయటపెట్టే అవకాశం ఉంది. జూన్ 12న, అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుండి లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 32 సెకన్లలోనే కూలిపోయింది. 10 మంది క్యాబిన్ సిబ్బంది, ఇద్దరు పైలట్లు సహా విమానంలో ఉన్న 241 మంది సజీవ దహనమయ్యారు.
Also Read :భారత్ వ్యవసాయంపై ట్రంప్ దెబ్బ..!
ఈ భయంకరమైన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన జరిగిన వారం తర్వాత.. ఎయిర్ ఇండియా స్వతంత్ర దర్యాప్తు కూడా చేపట్టింది. పైలట్లు డ్యూయల్-ఇంజన్ లో వచ్చే సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేసారు. ఈ ఘటనలో ఇప్పటికే బ్లాక్ బాక్స్ లను కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. డేటాను కూడా విజయవంతంగా డౌన్లోడ్ చేసాయి దర్యాప్తు బృందాలు. అవసరమైతే ఆ డేటాను విదేశాలకు పంపించే యోచన చేస్తోంది కేంద్రం.