Friday, September 12, 2025 02:55 PM
Friday, September 12, 2025 02:55 PM
roots

ఐటీ హబ్‌గా వైజాగ్‌… లోకేష్‌ కృషికి కంపెనీలు ఫిదా…!!

ఏపీని ఐటీ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో టాటా మోటార్స్‌కు రూపాయికే భూమి కేటాయించిన స్ఫూర్తితో, ఏపీలోనూ అదే తరహా విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విశాఖపట్నంను ఐటీ హబ్‌గా మార్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు. ఐటీ సెక్టార్‌లో ఉన్న టాప్ – 100 కంపెనీలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు లోకేష్. వైజాగ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే 99 పైసలకే భూములు కేటాయిస్తామన్నారు.

Also Read : లోకేష్ ప్లీజ్.. జూబ్లిహిల్స్ లో దూరంగా ఉండండి..?

కూటమి సర్కార్ ఐటీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ఒక్కొక్కటిగా ఫలిస్తున్నాయి. ప్రముఖ కంపెనీలు ఇప్పటికే ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు రెడీ అయ్యాయి. ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ కాగ్నిజెంట్‌కు కేవలం ఒక్క రూపాయి లీజుపై 21.31 ఎకరాల భూమిని కేటాయించింది కూటమి సర్కార్‌. ఈ సంస్థ విశాఖపట్నంలో రూ. 1,582.98 కోట్ల పెట్టుబడితో క్యాంపస్ ఏర్పాటు చేసి, 8,000 ఉద్యోగాలు కల్పించనుంది. అదేవిధంగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు కేవలం 99 పైసలకే 21.16 ఎకరాలు కేటాయించగా, ఆ సంస్థ రూ. 1,370 కోట్ల పెట్టుబడితో 12,000 ఉద్యోగాలు సృష్టించనుంది.

Also Read : కూటమి నేతకు కీలక పదవి..!

మరోవైపు వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రణాళికపై మంత్రి లోకేశ్ స్పష్టత ఇచ్చారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మూడు రాజధానుల విధానానికి వ్యతిరేకమని ఆయన అన్నారు. ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతంలో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు లోకేష్‌. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. విశాఖను ఐటీ హబ్‌గా, గ్లోబల్ కెమికల్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు, కొత్త విమానాశ్రయం, దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

Also Read : సుప్రీం చీఫ్ జస్టీస్ సంచలన కామెంట్స్

ఐటీ హబ్‌గా వైజాగ్‌ని మార్చాలని లోకేష్‌ విపరీతంగా శ్రమిస్తున్నారు.. కంపెనీలకు భారీ రాయితీలు ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్నారు.. ఎకరా 99 పైసలకే ఇవ్వడం ఏంటని ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా, ఆరోపణలు వచ్చినా ఆయన లైట్‌ తీసుకుంటున్నారు.. వైజాగ్‌ని ఐటీ చిత్రపటంలో చేర్చే వరకు తగ్గేదేలే అని సవాల్‌ విసురుతున్నారు. లోకేష్‌ తీసుకుంటున్న చొరవకి బడా కంపెనీలు సైతం ఫిదా అవుతున్నాయి.. భారీ కంపెనీలు సైతం వైజాగ్‌కి క్యూ కడుతున్నాయి.. ఇప్పటికే 100కి పైగా సాఫ్ట్ వేర్‌ కంపెనీలు విశాఖ తీరాన అడుగుపెట్టగా, తాజాగా పలు దిగ్గజ కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి.. ఇదే ఊపు మరో అయిదేళ్లు కొనసాగితే, ఐటీ మ్యాప్‌లో వైజాగ్‌ కొలువుదీరడం ఖాయం అని ఐటీ నిపుణలు తేల్చి చెబుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్