శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కరేడులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇండోసోల్ సంస్థకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వేల కోట్ల రాయితీలతో వేల ఎకరాలు ఇచ్చేందుకు ప్లాన్ చేసింది. లక్ష రూపాయల మూలధన పెట్టుబడితో మొదలైన సంస్థకు వేల కోట్ల రాయితీలు, వేల ఎకరాలు ఎలా ఇస్తారనేది నాటి ప్రతిపక్ష టీడీపీ నేతల మాట. యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ కూడా ఇండోసోల్ సంస్థకు భూ కేటాయింపుపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. కానీ నాటి జగన్ దోపిడీ నిర్ణయాలను నేడు కూటమి కూటమి సర్కార్ ఇదే విషయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం మొదలుపెట్టింది. దీంతో ఎవరు ఎవరితో లాలూచీ పడ్డారు అనే చర్చ ఇప్పుడు పార్టీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజల్లో కూడా జరుగుతోంది.
Also Read : పదేళ్లు.. 15 ఏళ్లు.. హాట్ హాట్ పాలిట్రిక్స్..!
కూటమి ప్రభుత్వం ఇండోసోల్ భూ సంతర్పణకు రంగం సిద్ధం చేసింది. పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదించిన 8, 348 ఎకరాల్లో.. 2024 మార్చి నాటికి 4.87 శాతం భూముల్నే రెవెన్యూ అధికారులు సేకరించారు. భూసేకరణ పూర్తయ్యాక.. ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు వచ్చాకే పరిశ్రమ నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. కానీ ఇక్కడే ఇండోసోల్ సంస్థ మైండ్ గేమ్ ఆడేసింది. వాస్తవానికి ఇండోసోల్ సంస్థ మూలాలు పులివెందులలో ఉన్నాయనేది బహిరంగ రహస్యం. అందుకే జగన్ ప్రభుత్వంలో ఇండోసోల్ సంస్థకు పెద్ద ఎత్తున కాంట్రాక్టులు, రాయితీల వచ్చాయని అప్పట్లో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఇండోసోల్ మాత్రం భూ సేకరణ కొలిక్కి రాకుండానే 35 ఎకరాల్లో షెడ్లు ఏర్పాటు చేసి.. 500 గిగావాట్ల ప్యానళ్ల తయారీ సామర్థ్యం ఉన్న యూనిట్‌ను ఉత్పత్తిలోకి తెచ్చినట్లు ప్రకటించింది. ఇంత హడావుడిగా ఉత్పత్తిని ప్రారంభించాల్సిన అవసరం నాడు ఎందుకు వచ్చిందనేది అప్పట్లో ఎవరికీ అర్థం కాలేదు.
Also Read : ఉగ్రవాదులకు బరా బర్ మద్దతు ఇస్తాం.. పాక్ ఆర్మీ చీఫ్ సంచలన కామెంట్స్
లోంగీ.. LONGI.. అనే చైనా సంస్థ 35 వేల మెగావాట్ల సోలార్ ప్యానల్స్ కేవలం 13 వందల ఎకరాల్లో ఏర్పాటు చేస్తోంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ ప్యానల్ ప్లాంట్. ఇండోసోల్‌కు 10 వేల మెగావాట్లకు PLI స్కీమ్ కింద కేంద్రం అనుమతిచ్చింది. కానీ.. ఇండోసోల్ 20 వేల మెగావాట్ల ప్యానల్స్ ఏర్పాటు చేస్తామంటోంది. ప్రపంచంలో అతిపెద్ద మ్యానుఫ్యాక్చురర్ సంస్థ కంటే.. 7 రెట్ల భూమిని ఇండోసోల్ ఎందుకు కోరుతోంది అనేదే ఇప్పుడు కరేడు రైతుల ప్రశ్న. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో వాన్ పిక్ సంస్థ పేరుతో జరిగిన భూ దోపిడీ నేటికి ఆ ప్రాంత రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. లేపాక్షి భూములు.. ఉక్కు కర్మాగారం పేరుతో గాలి జనార్థన్ రెడ్డి బ్రహ్మణి స్టీల్స్ సంస్థకు వేల ఎకరాల కేటాయింపు లాటిందే జగన్ జమానాలో ఇండోసోల్ భూ కేటాయింపు.
Also Read : మరాఠా గడ్డపై థాక్రేల హగ్ సెన్సేషన్
ఇండోసోల్ సంస్థకు భూములు ఇచ్చేది లేదని కరేడు రైతులు తెగేసి చెప్పారు. గ్రామసభను అడ్డుకున్నారు. కరేడు గ్రామానికి ఒకవైపు సముద్రం. 30 అడుగుల లోతులోనే మంచినీరు. పచ్చని పంట పొలాలు. అందుబాటులో రవాణా వ్యవస్థ. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఉలవపాడు మామిడి, పులికాట్ చేపలు, రొయ్యలు.. ఇంతటి విలువైన భూములను సోలార్ ప్లాంట్ పేరుతో అడ్డగోలుగా దోచెయడానికి ప్రయత్నిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కూటమి సర్కార్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇండోసోల్ సంస్థకు భూములు ఇచ్చేది లేదంటున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేసేందుకు, ప్రాణ త్యాగం చేసేందుకు కూడా తాము సిద్ధమంటున్నారు రైతులు.
Also Read : యంగ్ టైగర్ విత్ కింగ్ ఖాన్.. బాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్
కూటమి సర్కార్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతలు ఇండోసోల్ భూకేటాయింపులు, కరేడు గ్రామంలో ఉద్రిక్తతపై కనీసం స్పందించటం లేదు. సర్పంచ్‌పై దాడి చేశారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన జగన్.. కరేడు వ్యవహారంపై కన్నెత్తి కూడా చూడలేదు. వాస్తవానికి ఎల్లో మీడియా అంటూ వైసీపీ నేతలు ఆరోపించే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో కరేడు వార్త మెయిన్ ఎడిషన్‌లో వస్తే.. వైసీపీ అధికారిక సాక్షి పత్రికలో మాత్రం.. జిల్లా ఎడిషన్ జోన్ పేజీలో వచ్చింది. ఈ విషయంపై వైసీపీ నేతలు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారనేది బహిరంగ రహస్యం.




